»   » ఆరెంజ్ ప్లాప్ తో రామ్ చరణ్ పై చెరిగిన ‘మగధీర’ ముద్ర...

ఆరెంజ్ ప్లాప్ తో రామ్ చరణ్ పై చెరిగిన ‘మగధీర’ ముద్ర...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిశ్రమలో ఒక్క హిట్టు సినిమా ఇచ్చి 10 సినిమాల వరకు జోరు కొనసాగించు కోవచ్చు అనే హీరోలకి చెంప పెట్టులాంటి నిదర్శనమిది. 'మగధీర" లాంటి మహత్తర విజయం తర్వాత రామ్ చరణ్ కెరీర్ కి ఢోకా లేదనుకొన్న యావత్ సినీ అభిమానులకి 'ఆరెంజ్" చిత్రం మన హీరోగారి అసలు రేంజ్ ఏంటో కరెక్ట్ గా చూపించింది. ధరణి దర్శకత్వంలో రూపొందుతున్న 'మెరుపు" చిత్రానికి నిర్మాతలైన పరాస్ జైన్, ప్రసాద్ గార్లు 'ఆరెంజ్" దెబ్బకి రామ్ చరణ్ ఒంటరిగా ఓసాదాసీదా చిత్రాన్ని మోసేంత పరిణితి ఇమేజ్ సాధించలేదన్న సత్యాన్ని గ్రహించి బెంబేలెత్తి పోయారట. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తమ 'మెరుపు" చిత్రానికి వన్నెలు అద్దే పనిలో భాగంగా నానా పటేకర్ ని గానీ, తమిళ సూపర్ స్టార్ అర్జున్ ని గానీ ముఖ్య పాత్ర ద్వారా చిత్రంలో ప్రవేశపెట్టి చరణ్ ఇమేజ్ కి డేమేజ్ లేకుండా తమ పని తాము కానిచ్చేసుకోవాలన్న పనిలో పడ్డారట ఈ తెలివైన నిర్మాతలు.

English summary
The adverse impact of Orange failure started to fall on Ram Charan"s new movie Merupu. Director Dharani distinguished for delivering the debacle "Bangaram" appears to have opted for recourse with an intention not to bet totally upon Ram Charan"s waning Magadheera fever.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu