For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లరి నరేష్ ‘యాక్షన్'లో కె.రాఘవేంద్రరావు

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగు సినీ చరిత్రలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుది ఓ ప్రత్యేక స్ధానం. హీరోయిన్స్ ని అందంగా చూపించటంతో ఆయనకి ఆయనే సాటి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ట్రిబ్యూట్ గా..అల్లరి నరేష్ సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారని సమాచారం. అల్లరి నరేష్ హీరోగా దూకుడు నిర్మాత డైరక్టర్ గా మారి చేస్తున్న యాక్షన్ చిత్రంలో ఈ ప్రత్యేకత చోటు చేసుకోనుంది. ఈ మేరకు రాఘవేంద్రరావు హిట్ పాటల్లో కొన్ని తీసుకుని రెట్రో స్టైల్లో ఓ ప్రత్యేకపాటను చిత్రీకరించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు బప్పీ లహరి ఓ పాటను సిద్దం చేసినట్లు సమాచారం.

  అల్లరి నరేష్, వైభవ్, రాజసుందరం, కిక్‌శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు అనిల్‌ సుంకర మాట్లాడుతూ, 'ఓ చక్కటి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం బాగా వస్తున్నదంటే అందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉంది. సర్వేష్‌ మురారి ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. త్వరలో బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్‌, గోవాలో ఓ షెడ్యూల్‌ చేస్తాం' అని చెప్పారు.

  ఈ చిత్రం గురించి 'అల్లరి'నరేష్‌ మాట్లాడుతూ, 'సినిమా రంగం పట్ల అభిరుచి మాత్రమే కాదు పక్కా ప్లానింగ్‌ ఉన్న నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రంతో దర్శకుడు కావడం అభినందనీయం. లోగడ నిర్మాతగా అనిల్‌ తీసిన చిత్రాలు ఎంతోబాగా వచ్చాయంటే, వాటిలో ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఇక ఈ చిత్రకథ కోసం ఆయన ఒకటిన్నర సంవత్సర సమయాన్ని వెచ్చించారు. బైలింగ్వల్‌ చిత్రమిది. ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళ వెర్షన్‌ షూటింగ్‌ కూడా చేస్తున్నారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్‌ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొత్తంమీద ఓ మంచి టీమ్‌తో కలసి 3డి సినిమా చెయ్యటం ఓ కొత్త అనుభవం' అని అన్నారు.

  బిందాస్‌', 'అహనా పెళ్లంట' చిత్రాల నిర్మాత అనిల్‌ సుంకర దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ్‌లో 3డిలో తెరకెక్కుతోంది. అల్లరి నరేష్‌, కిక్‌శ్యామ్‌, రాజు సుందరం, వెైభవ్‌, స్నేహ ఉల్లాల్‌, కామ్న జెఠ్మలాని, రీతు బర్మేచ, నీలం ఉపాధ్యాయ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం, నాజర్‌, జయప్రకాష్‌, మనోబాల, ఝాన్సీ, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, కళ: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, స్టీరియోగ్రాఫర్‌: కేత్‌ డ్రివర్‌(యుఎస్‌ఎ), సంగీతం: బప్పా-బప్పీలహరి, నేపథ్యసంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ-కథనం-దర్శకత్వం: అనిల్‌ సుంకర.

  English summary
  
 Allari Naresh’s Action is going to feature a special song which is reportedly a tribute to veteran director K Raghavendra Rao’s style. Anil Sunkara, who’s directing Action, has decided to pay an ode to K Raghavendra Rao’s style.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X