రికార్డు స్థాయిలో స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. కోట్ల రూపాయల వర్షమే..

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులను తిరుగరాయడానికి సిద్ధమవుతున్నది.

By Rajababu

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులను తిరుగరాయడానికి సిద్ధమవుతున్నది. బాహుబలి రిలీజ్ తర్వాత అత్యంత భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా స్పైడర్ సినిమా ఓ ఘనతను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి హక్కులను అమ్మక పోవడం గమనార్హం. కానీ ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఆఫర్లు భారీగా వస్తున్నట్టు సమాచారం.

కెరీర్‌లోనే అత్యధికంగా

కెరీర్‌లోనే అత్యధికంగా

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. అయితే తెలుగులో ఈ సినిమా హక్కుల రేటు భారీగానే పలుకుతున్నట్టు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 90 కోట్లు పలికే అవకాశాలు ఉన్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇదే నిజమైతే మహేశ్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక రేటు సాధించిన చిత్రంగా అవుతుంది.

Recommended Video

Mahesh babu fun at sets with spyder team
తమిళంలోను రికార్డు ధరకు

తమిళంలోను రికార్డు ధరకు

ఇక తమిళ భాష హక్కులు ఇప్పటికే అమ్మారు. హక్కులను లైకా సంస్థ రూ.23 కోట్లు చెల్లించి సొంతం చేసుకొన్నది. తమిళ, తెలుగు, కన్నడ భాషల శాటిలైట్ హక్కులు రూ.26 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇంకా హిందీ, మలయాళ భాషల హక్కులు అమ్మాల్సి ఉంది. ఈ రెండు భాషలకు దాదాపు రూ.25 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు.

ట్రేబుల్ ప్రాఫిట్.. సేఫ్ జోన్

ట్రేబుల్ ప్రాఫిట్.. సేఫ్ జోన్

అత్యంత సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో దాదాపు రూ.170 కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమాను విడుదల చేయాలన్న ఉద్దేశంతో చిత్ర నిర్మాత ముందుకెళ్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా డిస్టిబ్యూటర్లు కూడా సేఫ్‌జోన్‌లో ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.

ఆగస్టు 9న టీజర్..

ఆగస్టు 9న టీజర్..

మహేశ్‌బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. మహేశ్‌తో నాని సినిమా రూపొందించిన దర్శకుడు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో విలన్‌గా కనిపించడం ఓ ప్రత్యేకత. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రిన్స్ బర్తేడే కానుకగా ఆగస్గు 9వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X