»   » శ్రీను వైట్ల నెక్ట్స్ చిత్రం ఆ హీరోతోనా?

శ్రీను వైట్ల నెక్ట్స్ చిత్రం ఆ హీరోతోనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా బ్రూస్ లీ అంటూ రామ్ చరణ్ తో వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి ప్రాజెక్టు ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సారి ఆయన స్టార్ హీరోలతో వెళ్లదలచుకోలేదని, తనకు ప్రారంభ దశలో హిట్ ఇచ్చిన హీరో రామ్ తో ముందుకు వెళ్లాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలుగు సినీ వర్గాల సమాచారం.

Sreenu Vaitla next movie with Hero Ram?

అందుకోసం రామ్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమ గత హిట్ చిత్రం రెడీ ఛాయిలు పడకుండా ఓ కథను రెడీ చేసి వినిపించినట్లు చెప్తున్నారు. హీరో రామ్ కూడా చాలా ఇంట్రస్ట్ తో ఈ ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తన హోం బ్యానర్ స్రంవతి లో నే ఈ చిత్రం నిర్మాణమయ్యే అవకాసం ఉంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నారని, ఫైనల్ అయిన తర్వాత ఓ వెర్షన్ వినిపించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమచారం ఏదీ లేదు.

Sreenu Vaitla next movie with Hero Ram?

ఇక శ్రీను వైట్ల, రామ్ కాంబినేషన్ లో 2008 లో 'రెడీ' చిత్రం వచ్చి ఘన విజయం సాధించింది. విలన్ ఇంట్లో అతనికి తెలీయకుండా మకాం పెట్టి విలన్ కి బుద్ది చెప్పే స్క్రీన్ ప్లే తో రెడీ అయిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టింగ్ స్క్రీన్ ప్లే గా మారి, చిన్నా పెద్ద అందరు హీరోలు అదే స్క్రీన్ ప్లే అనుసరించేలా చేసింది. దాంతో బోర్ కొట్టేసి చివరకు శ్రీను వైట్లకు సైతం పనికిరాకుండా పోయింది.

English summary
Sreenu Vaitla decided to team up again with Ram.
Please Wait while comments are loading...