»   » శ్రీశాంత్ హీరోగా సినిమాలో కోహ్లి-అనుష్క లవ్వాయనం?

శ్రీశాంత్ హీరోగా సినిమాలో కోహ్లి-అనుష్క లవ్వాయనం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీశాంత్ హీరోగా తెలుగు ఫిల్మ్ మేకర్ సానా యాదిరెడ్డి తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయమై ప్రకటన చేసారు. ఈ సినిమాలో ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ లవ్వాయనం ఫోకస్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై శ్రీశాంత్ ను అడిగితే సినిమా స్టోరీ విరాట్ కోహ్లి, యువరాజ్, రవిశాస్త్రి ఇలా ప్రతి క్రికెటర్... జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రతిభించే విధంగా ఉంటాయి అంటున్నారు.

ఈ విషయమై సానా యాదిరెడ్డి మాట్లాడుతూ...శ్రీశాంత్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్, మ్యూజిక్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. శ్రీశాంత్ మంచి బౌలరే కాదు, మంచి డాన్సర్, సింగర్ కూడా. చాలా ఫ్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ జీవితంపై సినిమా రాలేదు. తొలిసారి మేం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు. జులై లేదా ఆగస్టులో సినిమా సెట్ష్ మీదనకు తీసుకెలుతున్నాం. తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో ఈ సినిమా చేయబోతున్నాం. మూడు భాషల్లో సినిమా లాంచ్ అవుతుంది అన్నారు.

Sreesanth’s movie on Kohli & Anushka?

శ్రాశాంత్ మాట్లాడుతూ..సానా యాదిరెడ్డి తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను ఇప్పటికే సినిమాల్లో నటించినా తెలుగులో చేస్తున్న తొలి సినిమా. బాలీవుడ్లో మహేష్ భట్ గారి నిర్మాణంలో క్యాబరే అనే సినిమా చేస్తున్నాను. 2011 వరల్డ్ కప్ తర్వాత నాకు టోస్ ఆపరేషన్ జరిగిన తర్వాత క్రికెట్ ఆడలేను అని భావించాను. బెంగుళూరులో చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవాడిని. ఆ అనుభవంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. మేం చేయబోయే సినిమాలో కేవలం క్రికెట్టే కాదు... ఒక ట్రూ లవ్ స్టోరీ కూడా రన్ అవుతుంది. నాకు బాగా కనెక్ట్ అయిన కథ. దక్షిణాదిలో నాకు సబ్జెక్టు నచ్చితే మంచి రోల్స్ చేస్తాను అన్నారు.

English summary
Sreesanth says, “It could be anybody’s story including Virat or Yuvraj Singh or Ravi Shastri sir’s story. The film has cricket backdrop but it travels more on other facets like love and sentiments”. Directed by Telugu producer Sana Yadireddy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu