»   » సవాల్ విసిరిన సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరాఘవ???

సవాల్ విసిరిన సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరాఘవ???

Posted By:
Subscribe to Filmibeat Telugu

సున్నిత భావోద్వేగ చిత్రాలు తీసే శ్రీరాఘవకు సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరుంది. ఆడవారి మాలటకు అర్ధాలే వేరులే, 7జి బృందావన కాలనీ లాంటి సెన్సిబుల్ చిత్రాలకు దర్శకత్వం చేసినటువంటి సెన్సిబుల్ డైరెక్టర్ కు కోపమొచ్చింది. సూర్య తమ్ముడు కార్తీ హీరోగా, రీమా సేన్ కథానాయికగా నటించగా, శ్రీరాఘవ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఆయుర్తివల్ ఓరువన్" ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకి 'యుగానికి ఒక్కడు" పేరుతో తెలుగులోకి అనువాదమై ఈ నెల 28 విడుదలకు సిద్ధమవుతోంది. ఓ హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి దీన్ని తీశారంటూ సినీ విశ్లేషకులు విమర్శించడం ఆయన కోపానికి కారణమైంది. దీంతో చెన్నయ్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. 'ఆయుర్తివల్ ఓరువన్" ఏదైనా సినిమాకు కాపీ అని నిరూపిస్తే ఇకముందు దర్శకత్వం జోలికి పోనంటూ సవాల్ విసిరారు. ఇంకో సినిమాను చూసి ఇన్ స్పయిర్ అవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనకొచ్చిన ఐడియాను యూనిట్ కషితో రెండేళ్లపాటు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించానని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu