అభిరామ్ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్.. బర్త్‌డే నాడు కూడా వదలకుండా.. అంతా మట్టే అంటూ !
మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు మనవడు, దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ గురించి నటి శ్రీరెడ్డి గతంలో సంచలన విషయాలు వెలుగులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు సినిమా అవకాశాలు ఇస్తానని అభిరామ్ మోసం చేశాడని తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించిన ఆమె ఫోటోలతో సహా లీక్ చేసి సంచలనం రేపింది.. అయితే ఇప్పుడు తాజాగా అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీ రెడ్డి ఎపిసోడ్ మొత్తం అభిరామ్ సినిమాలో చూపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్
దగ్గుబాటి వారసుడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రోజులుగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా అభిరామ్ ఒక ప్రముఖ ఛానల్ కు స్కైప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అభిరామ్ తన సినిమాకు సంబంధించి అలాగే తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

ఆ విషయం చెప్పేశాడు
నిన్న అంటే మే తొమ్మిదో తారీఖున అభిరామ్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిరామ్ తన జీవితంతో పాటు తాను చేస్తున్న సినిమాకు సంబంధించి కొన్ని కీలక విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. తేజతో సినిమా చేస్తున్నానని వెల్లడించిన అభిరామ్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించాడు. తేజ గతంలో తీసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ ఎపిసోడ్ కూడా
నటుడిగా తనకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలో మంచి కంటెంట్ కంటెంట్ తో సహా మెసేజ్ కూడా ఉండాలని ఆయన కోరాడు.. ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని ఆ సినిమా చూశాక మీరే విషయం ఒప్పుకుంటారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తన గత జీవితాన్ని ఓపెన్ చేసి చూపించినట్లు జనం ఫీలవుతారని ఈ సినిమా ద్వారా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు.

అది తప్పే.. అందుకే జాగ్రత్త
ఇక శ్రీ రెడ్డి విషయంలో తాను తప్పు చేశాను అని ఒప్పుకున్న దగ్గుబాటి వారసుడు, ఇక మీదట అలాంటి తప్పులు చేయనని చెప్పుకొచ్చాడు. అలాగే యూత్ కి కూడా ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఈ ఏజ్ లో దూకుడు ఉండటం సహజమే కానీ ఏ పని చేస్తున్న ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలని మన వల్ల మన ఫ్యామిలీ కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా చేశారు అని చెప్పుకొచ్చారు. తన లైఫ్ లో జరిగిన బ్లాక్ మెయిల్ అనేది అందరి లైఫ్ లో ఉంటుందని కొంతమంది భయపడతారు కొంతమంది భయపడరు అని చెప్పుకొచ్చారు.

పట్టిందల్లా మట్టి అయిపోద్ది
ఇక ఇదిలా ఉండగా శ్రీ రెడ్డి కూడా అభిరామ్ సినిమా గురించి ఆసక్తికరంగా స్పందించింది. నిన్న తన ఫేస్ బుక్ పేజ్ లో ఆమె ఈ మేరకు కామెంట్లు చేసింది. పుట్టిన రోజు అని కూడా చూడకుండా అభిరామ్ సినిమా సర్వ నాశనం అయిపోతుంది అంటూ శాపనార్థాలు పెట్టింది. ''మావయ్య సురేష్ బాబు గారు మా ఆయన అభిరామ్ గాడు కుళ్ళి కుళ్ళి ఏడ్చే మరిన్ని పుట్టిన రోజులు రావాలని కోరుకుంటున్నా'' అని కామెంట్ చేసింది. అలాగే అభిరామ్ మూవీ డిజాస్టర్ అవుతుంది, వాడు వాడి నాన్న పట్టిందల్లా మట్టి అయిపోద్ది చూస్తూ ఉండండి అంటూ ఆమె కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











