»   » ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు అంటూ....!

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు అంటూ....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీదేవి కూతురు జాహ్నవి సినీ రంగ ప్రవేశం గురించి గత రెండు మూడేల్లుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఆమె ఎంట్రీ ఖరారు కాలేదు. పలానా హీరో సినిమా ద్వారా జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అవుతుందని మీడియాలో రావడం, శ్రీదేవి ఆ వార్తలను ఖండించడం సర్వసాదారణం అయిపోయింది.

ఇదే క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయనట. మరి ఈ సారైనా జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అవుతుందా? లేక ఇది కూడా రూమర్ల లిస్టులో చేరిపోతుందా? అనేది తేలాల్సి ఉంది.

Sridevi's daughter Jhanvi Kapoor to make her debut in Jr NTR film?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవలే జరిగింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం అక్టోబర్ హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో చిత్ర బృందం నడుమ జరిగింది.

ఈ చిత్రానికి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టగా, ఆయన తనయుడు అభయ్ రామ్ తో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు. కొరటాల శివ తో నాకు బృందావనం రోజుల నుండి అనుబంధం ఉంది. అయన ఒక అధ్బుతమైన రచయిత. ఒక అభిరుచి గల డైరెక్టర్. క్లాస్, మాస్ అంశాలను ఆయన బాలన్స్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ అందించిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీస్ సంస్థ తో పని చేయటం ఆనందం గా ఉంది అన్నారు.

English summary
Film Nagar source said that, Sridevi's daughter Jhanvi Kapoor to make her debut in Jr NTR film.
Please Wait while comments are loading...