»   » అందం ఆనే పదం ఆమె నుంచే పుట్టిందేమో..?

అందం ఆనే పదం ఆమె నుంచే పుట్టిందేమో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శ్రీదేవి' ఒకప్పుడు దేశం మొత్తాన్ని తన అందచందాలతో కట్టిపడేసింది. శ్రీదేవి అంటే అంత పిచ్చి ఆమె అభిమానులకు. వయసు పెరుగుతున్న కోద్ది ఈమె అందం మాత్రం తగ్గలేదంటే నమ్మండి. అప్పటికి ఇప్పటికి ఈమెకున్న ఆదరణ కూడా తగ్గలేదు. భాషాభేధం లేకుండా తనఅందచందాలతో అందరని ఆకట్టుకుంది. బోనీకపూర్ తో పెళ్శయ్యాక మాత్రం సినిమాలకు దూరమైంది. ఈమె పునరాగమనం కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో బుల్లి తెర ప్రేక్షకులను కనికరించిందికాని, వెండితెర ప్రేక్షకుల ఆశలను మాత్రం తీర్చలేదు.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీదేవి అభిమానులకు ఓ తీపి కబురు. శ్రీదేవి వెండితెరపై నటించడానికి సిధ్దంఅయిందని వినికిడి. ఇంతకీ ఆచిత్రంలో హీరో ఎవరు అని అనుకుంటున్నారా..? ఇంకెవరు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.'బిగ్ బి'పేరుతో తీస్తున్న ఈ చిత్రానికి 'ఆర్. బల్కి'దర్శకుడు. అమితాబ్ తో 'పా', 'చినీకమ్' చిత్రాలను తీశారు. అమితాబ్-శ్రీదేవి 18 యేళ్శ తర్వాత మళ్శీ కలసి నటిస్తున్న చిత్రమిది. 'ఇళయరాజా' ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తారు. లేటు వయసులో తీస్తున్న ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుందాం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu