»   » షాకిచ్చే రేంజిలో ఎన్టీఆర్ 'బృందావనం' కి శ్రీహరి రెమ్యునేషన్

షాకిచ్చే రేంజిలో ఎన్టీఆర్ 'బృందావనం' కి శ్రీహరి రెమ్యునేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిల్ రాజు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న బృందావనంలో ఓ కీలకమైన పాత్రకు శ్రీహరిని అడిగితే ఒప్పుకోలదని అప్పుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఒప్పించాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎంతగా ఒప్పుకున్నా రెమ్యునేషన్ మాత్రం బాగా ఎక్కువ డిమాండ్ చేసాడని, చివరకు బేరం ఆడి కోటిన్నరకు సెట్ చేసారని తాజా సమాచారం. దాంతో ఈ విషయం తెలిసిన వారంతా అంత ఖర్చు పెట్టి ఒప్పించిన పాత్ర తెరపై ఏ రేంజిలో పండుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక మున్నా ఫేమ్ వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఏమి మాయచేసావే ఫేమ్ సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని దర్శక, నిర్మాతలు చెప్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు కెమెరా అందిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu