»   »  ఏంటీ శ్రీహరికి ఒంట్లో బాగోలేదా?

ఏంటీ శ్రీహరికి ఒంట్లో బాగోలేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srihari
హైదరాబాద్ : రియల్ స్టార్ శ్రీహరి అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగిన తెలుగు నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఏ కాంట్రావర్శీలేని వ్యక్తి. ఆయన గత కొద్ది కాలంగా బాగా చిక్కిపోయి కనపడటం ఆయన అభిమానులు,సినిమా వారిని కలవరపరుస్తోంది.

ముఖ్యంగా మొన్న వచ్చిన రామ్ చరణ్...తుఫాన్ చిత్రం ఆడియో పంక్షన్ లో ఆయన్ని చూసిన వారు చాలా షాక్ అయ్యారు. జాండీస్ అని కొందరంటుంటే మరికొందరు వేరే అంటున్నారు...ఏదనేది ఎవరికీ తెలియటం లేదు కానీ.. ఇవన్నీ రూమర్స్ అయ్యి ..శ్రీహరి పూర్తిగా కోలుకుని తిరిగి యధారూపానికి అంటే మాచో పర్శనాలిటీ తో కూడిన పూర్తి ఫిజిక్ కనపడాలని అంతా కోరుకుంటున్నారు.

ఇక శ్రీహరీ వచ్చే ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన స్వయంగా ఈ విషయం చెప్పారు. వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్‌బై చెప్పి ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు నటుడు శ్రీహరి ఇటీవల కూడా తెలిపారు.


అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన శ్రీహరి ఆయన మరణానంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారని నిరుడు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసిన శ్రీహరి త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరతానని ప్రకటించారు కూడా.

English summary
Movie lovers adored Srihari macho personality on and off screen. Being a sports person who qualified for National and International level as a gymnast helped him keep maintain his slim and trim physique. However of late change in his personality is noticed which was quite evident during ‘Toofan’ audio launch. He looked frail and even his voice quivered.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu