twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోదావరి యాస దర్శకుడుతో పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇద్దరు ప్రముఖ హీరోలను కుటుంబ కథనంలో నడిపిస్తూ.. తెలుగు సినిమా అంటే ఇదీ అని మరోసారి చెప్పిన సినీ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఆయన తాజా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఆయన తదపరి చిత్రాలకు ప్లాన్స్ వేసుకుంటున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ,గోదావరి యాసతో కూడిన కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ వారంలోనే దాన్ని ఆయనకు నేరేట్ చేస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాలను 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజైన తర్వాత పవన్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.

    మొదట 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో మహేష్ చేసిన చిన్నోడు పాత్రకు పవన్ నే అనుకున్నారు. కానీ పవన్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ తో ఈ దర్శకుడు చెలరేగనున్నాడు. ఇక తన తాజా చిత్రం గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ కుటుంబ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో మహేష్‌బాబు, వెంకటేష్‌ల నటన జీవం పోసిందన్నారు. చిరునవ్వుతో ఒక అడుగేస్తే మంచి స్నేహపూర్వక వాతావరణం తద్వారా కుటుంబం, సమాజం ఏర్పడుతుందని ఈ చిత్రంలోని కథ రుజువు చేసిందని చెప్పారు. నా ఆలోచనకు నిర్మాత దిల్‌రాజు ఇచ్చిన ప్రోత్సాహమే 'సీతమ్మ వాకిట్లో...' చిత్ర విజయమన్నారు.

    హింస, పోరాటాలు నేపథ్యంలో వస్తున్న చిత్రాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. కుటుంబ నేపథ్యం, మంచి కథతో చిత్రాలు రావాలని కోరుకునే వారిలో తాను మొదటివాడినని చెప్పారు. అలాగే తనకు సినీ దర్శకుడికా మారడానికి మీకు ప్రేరణ గురించి చెపుతూ... వాస్తవానికి దగ్గరగా ఉండి సున్నితమైన, భావోద్వేగమైన సన్నివేశాలు కలిగిన సినిమాలు ఎన్నో చూశా. ఆ ప్రేరణతోనే దర్శకుడిగా మారా. సినీ దర్శకులు దాసరి నారాయణరావు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడ్ని అన్నారు. ఇక తాను ఠాగూర్‌, ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశా. నా తొలి చిత్రం 'కొత్తబంగారులోకం' ప్రేక్షకులను కదిలించింది. కుటుంబ కథా చిత్రాలు అందించాలనే లక్ష్యంతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టా అన్నారు.

    ఇద్దరు పెద్ద కథనాయకులతో కుటుంబ కథతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తీసిన అనుభవం గురించి చెపుతూ... ఈ చిత్రం తీసే సమయంలో ఆ హీరోలను కాకుండా కథనే నేపథ్యంగా తీసుకుని ముందుకు సాగా. మహేష్‌బాబుకు, వెంకటేష్‌కు గతంలో ఉన్న చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం మలిచే సమయంలో కొన్ని సన్నివేశాల్లో వారిద్దరూ అందించిన సహాయ సహకారాలు మరువలేను. సీతమ్మ వాకిట్లో చల్లని మల్లెచెట్టు ఉంటే ఎంత సువాసనగా ఉంటుందో అదే రీతిలో ప్రేమానుబంధాలతో కుటుంబం ముడిపడి ఉండాలనే ఆశయంతో చిత్రం తీసి విజయవంతం అయ్యా అన్నాడు.

    English summary
    Srikanth Addala is preparing a full to entertaining subject for Pawan and he will be narrating the story soon after completing it. He is a great fan of Pawan Kalyan and actually the Power Star was the original choice for Chinnodu role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X