»   » ఇండస్ట్రీ షాక్ న్యూస్: శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మెగా హీరోతో ...

ఇండస్ట్రీ షాక్ న్యూస్: శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మెగా హీరోతో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"బ్రహ్మోత్సవం" చిత్రం రిలీజ్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎవరితో చేయబోతున్నారు..అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే సినిమా పెద్ద డిజాస్టర్. ఈ సమయంలో ఎవరు శ్రీకాంత్ అడ్డాలకు ధైర్యం చేసి సినిమా ఇవ్వబోతున్నారు. అయితే పిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..మెగా క్యాంప్ ..శ్రీకాంత్ అడ్డాలపై ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది.

ఇంతకు ముందు నాగబాబు కుమారుడు వరుణ్ తేజను ముకుందా చిత్రంలో శ్రీకాంత్ లాంచ్ చేసారు. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోయినా వరుణ్ తేజ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. అంటే సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసినట్లే అని చెప్పాలి. అయితే తర్వాత చేసిన బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ కావటంతో ఆయనపై నెగిటివ్ ముద్ర పడింది.మీడియా కూడా శ్రీకాంత్ అడ్డాలనే విలన్ గా చూపెట్టి ప్రచారం చేసింది.

Also Read: 'బ్రహ్మోత్సవం' చూసి బాధతో రాసిన ఓపెన్ లెటర్!

Srikanth Addala's next with a Mega Hero

కానీ గతంలో సుకుమార్ ఫ్లాఫ్ లో ఉన్నప్పుడు పిలిచి, నాగచైతన్యతో హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రం చేయించి హిట్ కొట్టిన అల్లు అరవింద్ ఈ సారి..శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అయితే హీరో రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఇద్దరిలో ఒకరై ఉంటారని అంటున్నారు.

అల్లు అరవింద్...స్క్రిప్టు విషయంలో చాలా స్ట్రిక్టు, బడ్జెట్ విషయంలో గా ఉంటాడంటారు. అదే నమ్మకంతో ..శ్రీకాంత్ అడ్డాల చేత పూర్తి స్క్రిప్టు చేయించి, అన్ని జాగ్రత్తలు తీసుకుని హిట్ కొట్టాలని నిర్ణయించుకన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎంతవరకూ నిజమో చూడాలి.

English summary
Buzz has that director Srikanth Addala who made films like Seethamma Vaakitlo will be now directing a mega hero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu