»   » విలన్ గా కమిటైన శ్రీకాంత్, ఎవరి సినిమాకోసం అంటే...

విలన్ గా కమిటైన శ్రీకాంత్, ఎవరి సినిమాకోసం అంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సిని పరిశ్రమలో తొలి రోజుల్లో విలన్ గా , తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , అనంతరం హీరోగా చేసుకుంటూ వస్తూ మళ్లీ ఇప్పుడు క్యారక్టర్స్ వైపు చూస్తున్న శ్రీకాంత్ ... విలన్ గా చేయటానికి కమిటయ్యాడని సమాచారం. ఇప్పటికే జగపతిబాబు విలన్ గా ఆకట్టుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో అదే బాటలో నడిచేందుకు శ్రీకాంత్ రెడీ అవుతున్నాడు.


ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి సక్సెస్లు సాధించిన శ్రీకాంత్ గత కొంతకాలంగా హీరోగా ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో విలన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు తొలి సినిమానే ఓ సూపర్ స్టార్ కు విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.


మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా మారుతున్నాడు. కాగా ఈ
సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సాఫ్ట్ గా కనిపించే శ్రీకాంత్ మరి విలన్ గా ఏ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

Srikanth turns villain for Mohanlal film

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉన్నికృష్ణ‌న్‌.బి ద‌ర్శ‌క‌త్వంలో రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మించ‌నున్న సినిమాలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో త‌మిళ హీరో విశాల్ కూడా న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌ల‌యాళంల‌తో పాటు ఈ సినిమాను త‌మిళం, తెలుగులో కూడా విడుద‌ల చేయ‌డానికే నిర్మాత‌లు త‌మిళ‌, తెలుగు సినీ రంగాల‌కు చెందిన న‌టీన‌టుల‌ను తీసుకుంటున్నార‌ని టాక్‌. అందులో భాగంగానే శ్రీకాంత్‌ను ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌కు సంప్ర‌దించార‌ని, త‌న పాత్ర న‌చ్చ‌డంతో శ్రీకాంత్ కూడా మోహ‌న్‌లాల్‌తో న‌టించ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్‌.

ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన శ్రీకాంత్ ఇప్పుడు మరోసారి నెగెటివ్ రోల్ లో నటిస్తుండటంతో ఆ సినిమాపై మాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హైప్ క్రియేట్ అవుతోందని భావిస్తున్నారు.

English summary
Senior hero Srikanth's Malayalam debut all set now. The film with Mohanlal under Unnikrishnan's direction is declared recently. Srikanth will have a crucial role and good screen time for this movie as debuting into Mallywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu