»   » అందుకే శ్రీదేవి దుబాయ్‌లో ఒంటరిగా? మీడియా ముందుకు కీలక విషయాలో శ్రీదేవి సోదరి!

అందుకే శ్రీదేవి దుబాయ్‌లో ఒంటరిగా? మీడియా ముందుకు కీలక విషయాలో శ్రీదేవి సోదరి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's Sister Ready To Break Her Silence

శ్రీదేవి హఠాన్మరణం, అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆమె సోదరి శ్రీలత మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవితో సంబంధాలు దాదాపుగా తెంచుకుని దూరంగా ఉంటున్న ఆమె తన సోదరి మరణంపై మౌనం వీడినున్నట్లు, మీడియా ముందుకు వచ్చి తన మసులో దాగి అనేక విషయాలను బయట పెట్టడంతో, మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వెబ్ సైట్లో కథనాలు వచ్చాయి.

శ్రీదేవితో ఆస్తి గొడవలు

శ్రీదేవితో ఆస్తి గొడవలు

శ్రీదేవి, శ్రీలతకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఆస్తుల విషయంలో ఇద్దరూ కోర్టుకెక్కారు. తర్వాత ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. అయితే, బోనీ కపూర్ యొక్క జోక్యం తరువాత, ఇద్దరు సోదరీమణులు రాజీకి వచ్చినట్లు సమాచారం.

తల్లి మరణం తర్వాత శ్రీదేవికి శ్రీలత సపోర్టు

తల్లి మరణం తర్వాత శ్రీదేవికి శ్రీలత సపోర్టు

తల్లి మరణం తర్వాత శ్రీదేవికి తన సోదరి శ్రీలత చాలా సపోర్టుగా ఉన్నారు. ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అంశాల్లో కూడా సపోర్టుగా ఉండేవారు. గతంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ...‘నా సోదరి లేకుంటే....నేను అసంపూర్తిగా ఫీలవుతాను' అని ఆమె చెప్పుకొచ్చారు.

అందుకే శ్రీదేవి దుబాయ్‌లో ఒంటరిగా?

అందుకే శ్రీదేవి దుబాయ్‌లో ఒంటరిగా?

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, మోహిత్ మార్వా వివాహానికి హాజరైన తర్వాత శ్రీదేవి తన సోదరితో కొంత సమయం గడిపేందుకు దుబాయ్‌లో ఉండిపోయారని, దీంతో ఆమె భర్త బోనీ కపూర్ కూతురు కుషీ కపూర్ ముంబైకి వెళ్లినట్లు సమాచారం.

ఎవరూ మాట్లాడలేదు

ఎవరూ మాట్లాడలేదు

శ్రీదేవి మరణంపై ఇప్పటి వరకు శ్రీదేవి కుటుంబం నుండి ఎవరూ స్పందించలేదు. కేవలం బోనీ సోదరుడు సంజయ్ కపూర్ మాత్రమే తన వదిన మరణించిన విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి మరణంపై భర్త బోనీ కపూర్ స్పందన కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో

సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో

శ్రీదేవి మరణం వెనక సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తొలుత హార్ట్ ఎటాక్ అని చెప్పి అందరినీ నమ్మించారు. అయితే పోస్టు మార్టం రిపోర్టులో ఆమె బాత్రూంలో టబ్ లో మునిగి చనిపోయిందని తేలింది. శ్రీదేవి మరణం వెనక కుట్ర కోణాలు ఏవీ ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. అభిమానుల్లో మాత్రం ఆమె మరణంపై అనేక సందేహాలు ఉన్నాయి.

English summary
Sridevi sister Srilatha's stoic silence over the actress' sudden death has raised many questions. However, if a report in Bollywood Hungama is to be believed, Latha is planning to break her silence in the next 48 hours which will reveal some critical details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu