»   » నాగ చైతన్యకి సీక్రెట్ తెలిసిపోయింది

నాగ చైతన్యకి సీక్రెట్ తెలిసిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ట్యాలెంట్ ఉన్న యువ దర్శకులను పసిగట్టి అవకాశాలు ఇవ్వటంలో నాగార్జున ముందుండే వారు. శివ, గీతాంజలి నుంచి నేటి మనం దాకా ఓ రకంగా అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నాడు. గుండె జారి గల్లంతైంది చిత్రంలో హిట్ కొట్టిన దర్శకుడుతో చిత్రం చేస్తున్న చైతు, తన తదుపరి చిత్రానికి సుధీర్ వర్మను ఎన్నుకున్నారు. అలాగే ఇంకా సినిమా కూడా రిలీజ్ కాని దర్శకుడుతో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు అవసరాల శ్రీనివాస్.

తొలి సినిమా రిలీజ్ కాకుండానే దర్శకుడుగా పెద్ద హీరోల నుంచి ఆఫర్స్ వస్తే ఆ దర్శకుడు పరిస్ధితి ఎలా ఉంటుంది..ఇప్పుడు అదే స్దితిలో అవసరాల శ్రీనివాస్ ఉన్నాడంటున్నారు. ఆయన డైరక్ట్ చేసిన 'వూహలు గుసగుసలాడే' చిత్రం విడుదల కాకముందే తదుపరి చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మేరకు నాగచైతన్య ని కలిసాడని సమాచారం. అయితే 'వూహలు గుసగుసలాడే' చిత్రంలో ఇండస్ట్రీలో ఉన్న పాజిటివ్ బజ్ విని నాగచైతన్య ఆసక్తి చూపించి, పిలిపించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. అధికారిక సమాచారం కోసం కొన్ని రోజులు వేచి చూడాలి.

Srinivas Avasarala to direct Naga Chaitanya?


'మనం'లో నాగార్జునగా అందరినీ మెప్పించాడు నాగచైతన్య. 'లేడీస్‌ ఫస్ట్‌..' అంటూ తనదైన శైలిలో వినోదం పంచాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కొత్త కథలు వింటున్నాడు. ప్రస్తుతం 'ఒక లైలాకోసం'సెట్స్‌పై ఉంది. సుధీర్‌ వర్మ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నారు. ఇప్పుడు చైతు ఖాతాలో మరో సినిమా చేరినట్లు సమాచారం. 'వూహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్‌ ఇప్పుడు ఆయన చైతు కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నారట. ఇటీవల అవసరాల శ్రీనివాస్‌ చైతన్యకి కథ వినిపించినట్టు తెలుస్తోంది.

'మనం'లో రాధా మోహన్‌గా, నాగార్జునగా రెండు విభిన్న పాత్రలతో అలరించారు నాగచైతన్య. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'స్వామి రా రా' దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్‌ నాయిక. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు.

నాగచైతన్య మాట్లాడుతూ ''స్వామి రా రా' నాకెంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. ప్రస్తుతం నేను చేస్తున్న 'ఒక లైలా కోసం' తర్వాత ఈ సినిమా మొదలవుతుంది'' అన్నారు.

''అన్ని వర్గాలను అలరిస్తూ నా తరహాలో సాగే సినిమా ఇది. నాగచైతన్య పాత్ర కొత్తగా ఉంటుంది'' అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ''సుధీర్‌వర్మ చెప్పిన కథ చాలా బాగుంది. నాగచైతన్యను కొత్త తరహాలో చూపించే చిత్రమిది. త్వరలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామ''అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్ ఇప్పటివరకూ ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నారాయణరెడ్డి.

English summary
Srinivas Avasarala is going to direct Naga Chaithanya in his next film. This film also will be produced by Sai Korrapti. Srinivas Avasarala is currently directing a movie titled ‘Oohalu Gusagusalaade’ which is been produced by Sai Korrapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu