»   » "మిస్టర్" కోసం సొంత ఫ్లాట్ అమ్మేసుకున్నాడా? : పాపం శ్రీను వైట్ల

"మిస్టర్" కోసం సొంత ఫ్లాట్ అమ్మేసుకున్నాడా? : పాపం శ్రీను వైట్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే నవ్వులతో పాటు మంచి ఎంటర్టన్మెంట్ కూదా లభిస్తుందన్న నమ్మకం ప్రేక్షకులకీ, తాము పెడుతున్న పెట్టుబడికి మినిమం గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం నిర్మాతలకీ ఉండేది, అయితే ఎందుకోగానీ శ్రీను వైట్ల పూర్తిగా డౌన్ అయిపోయాడు.

దారుణమైన ఫ్లాప్

దారుణమైన ఫ్లాప్

కొంత కాలం నుంచీ సరైన హిట్ లేకపోగా వరుస డిజాస్టర్లు, ఎనిమిదేళ్ళు తెరకు దూరంగా ఉన్న చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమా బ్రూస్లీ అయినా కనీస వసూళ్ళని సాధించుకోలేకపోయింది.., ఆతర్వాత ఇంకా దారుణమైన ఫ్లాప్., అయితే ఇన్ని ఫ్లాప్ ల తర్వాత కూడా మరో సినిమా అవకాశం ఇచ్చింది మెగా ఫ్యామిలీ కానీ ఆ అవకాశాన్ని కూడా నిలబెట్టుకోలేక పోయాడు...

రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు

రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదు

వరుస ఫ్లాపుల వల్ల మిస్టర్ కోసం రెమ్యునరేషన్ ఏమీ తీసుకోని శ్రీను వైట్ల తన వాటాగా ఆంధ్ర ఏరియాలోని మూడు జిల్లాల పంపిణీ హక్కులని మాత్రం తీసుకున్నాడట. అయితే ఇక్కడ కూడా ఒక మెలిక ఉంది సినిమా నిర్మాణం కనుక ఇరవై కోట్ల లోపులో పూర్తి చేయకపోతే, పైన అయ్యే ఖర్చంతా తనదే బాధ్యత అని కూడా ఒప్పంద పత్రంపై సంతకం చేసాడట.

 సొంత ఫ్లాట్ అమ్మి మరీ

సొంత ఫ్లాట్ అమ్మి మరీ

అదికాస్తా మరింత పెద దెబ్బ వేసింది అనుకున్న బడ్జెట్ దాటి పోవటం తో తన సొంత ఫ్లాట్ అమ్మి మరీ పెట్టుబడిగా పెట్టాడట. కానీ కలిసి రాలేదు ముందు సినిమాల తరహాలోనే "మిస్టర్" కూడా దారుణం గా చతికిల బడింది. అప్పటి వరకూ ఏమూలో ఉన్న ఆశకూడా ఆరిపోయింది. మిస్టర్ తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాననుకున్న శ్రీనువైట్ల మళ్ళీ తన పాత బాటలోనే ఇంకో ఫ్లాప్ కి బలయ్యాడు.

 కలెక్షన్లు లేకపోవటం తో

కలెక్షన్లు లేకపోవటం తో

మిస్టర్ కోసం బయ్యర్లు ఇచ్చిన అడ్వాన్సులకి సరిపడాకూడా కలెక్షన్లు లేకపోవటం తో ఇక బ్యాలెన్స్‌ ఏమాత్రం వచ్చే అవకాశాలు లేవంటున్నారు. దీంతో వైట్ల ఈ చిత్రంపై పెట్టినదంతా లాస్‌ అయిపోయాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినప్పటికీ శ్రీను వైట్లకి పారితోషికం మాత్రం ఫుల్‌గా వచ్చేసింది.

 ఎదురు డబ్బు పెట్టాల్సి వచ్చింది

ఎదురు డబ్బు పెట్టాల్సి వచ్చింది

కానీ ఈసారి మాత్రం వచ్చేది రాకపోగా ఎదురు డబ్బు పెట్టాల్సి వచ్చింది అదీ కోట్లలో. విడుదలకి ముందు ప్రమోషన్లలో బాగానే కనిపించిన వైట్ల ఫ్లాప్‌ అయిన తర్వాత మాత్రం మీడియాలో కనిపించనే లేదు. దాంతో ఈ వర్త నిజమే అని కంఫార్మ్ అయిపోతున్నారు ఇండస్ట్రీ జనం.

English summary
An interesting buzz roaming in Tollywood that Director Srinu Vytla lost his Flat due to Mister loss
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu