»   »  చుక్కలు చూపిస్తున్న శ్రీనువైట్ల?

చుక్కలు చూపిస్తున్న శ్రీనువైట్ల?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srinu Vytla
ఇప్పుడు తెలుగు దర్శకులలో హవా నడుస్తున్నది ఎవరికి అంటే శ్రీను వైట్లకి అన్నది కళ్ళు మూసుకు చెప్పవచ్చు. మొన్న రెడీ సినిమా విజయంతో ఆయన మినిమం గ్యారింటీ దర్శకుడు నుంచి లాభాలు తెచ్చిపెట్టే బంగారు బాతుగా నిర్మాతలకు ఆయన కనపడుతున్నారు. దాంతో చిన్నా పెద్దా ప్రొడ్యూసర్స్ అంతా ఆయనతో సినిమాలు తీయాలని ఉత్సాహపడుతున్నారు. ఈ స్ధితిని క్యాష్ చేసుకోవాలనీ,దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే కాన్సెప్టునీ ఆయన నమ్ముతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన రెమ్యునేషన్ ఒక్కసారిగా రెండు రెట్లు చేసారని సమాచారం.

ప్రస్తుతం కింగ్ సినిమాకు పనిచేస్తున్న ఆయన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ హీరోగా నటించే సినిమాకు కమిటయ్యారు. అది అయిన వెంటనే నాగార్డున నిర్మాతలు అయిన కామాక్షి మూవీస్ వారితో నాగ చైతన్య సినిమా చెయ్యటానికి ఎగ్రిమెంటు కుదుర్చుకున్నారని లేటెస్టు సమాచారం. ఈ సినిమా నిమిత్తం అక్షరాలా ఆరు కోట్ల రూపాయలు డిమాండు చేసారుట. దానికి వారు ఒప్పుకుని కోటి రూపాయలు అడ్వాన్స్ గా పే చేసారని చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెల్సుకున్న మిగతా నిర్మాతలు నోరు వెళ్ళబెట్టి తదుపరి కర్తవ్యం ఏమిటా అని చర్చించుకుంటున్నారుట. మరికొందరైతే ఫిగర్ తెల్సింది కదా ఫాలో అయితే ఫలితం దక్కుతుందని డిసైడ్ చేసుకుని సెల్ ఫోన్స్ ఆన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X