»   » శ్రీను వైట్ల కొత్త సినిమా టైటిల్ అదే?

శ్రీను వైట్ల కొత్త సినిమా టైటిల్ అదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీను వైట్ల తాజాగా తెలుగు సినీ ఫిల్మ్ చాంబర్ లో 'ఓం నమస్తే బోలో..' అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. జెనీలియా, రామ్ కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రంలోని ఓ పాటకు ఈ చరణం వస్తుంది. అయితే ఏ చిత్రానికి ఇది పెట్టబోతున్నారనే విషయం కన్ఫర్మ్ కాలేదు. మహేష్ బాబుతో ఆయన చేయబోయే చిత్రానికి ఈ టైటిల్ పెట్టే అవకాశం ఉందని వినపడుతోంది. ఇక సంక్రాంతికి రిలీజైన నమో వెంకటేశ ఊహించిన స్ధాయిలో విజయం కాకపోవటంతో ఆయన కాస్త నిరాసపడ్డారని చెప్తున్నారు. వెంకటేష్ హరోగా చేసిన ఈ చిత్రంలో త్రిష హరోయిన్ గా చేసింది. అయితే దీంతో పాటే రిలీజైన ఎన్టీఆర్ అదుర్స్ చిత్రం కామిడీ పరంగా బాగా వర్కవుట్ అయింది. ఇక మహేష్ బాబుతో చేయబోయే చిత్రం కామిడీతో కలగలసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్తున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలేజా చిత్రంలో చేస్తన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టులోకి వస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu