శ్రీను వైట్లని ఇరిటేట్ చేస్తున్న వార్త

By Srikanya

హైదరాబాద్: కొన్ని రూమర్స్ ఎవరు పుట్టిస్తారో కానీ అవి గాలికన్నా వేగంగా ప్రయాణం చేస్తూంటాయి. అయితే రూమర్స్ వల్ల పెద్దగా ఎప్పుడూ నష్టం జరగదు కానీ ఆ రూమర్స్ ఎవరిమీద అయితే వచ్చాయో...వారికి ఇరిటేషన్ కలిగిస్తూంటాయి. ఇప్పుడు శ్రీను వైట్లకు అలాంటి ఇరిటేషనే కలుగుతోందంటున్నారు.

వివరాల్లోకి వెళితే... మహేష్ తో చేసిన ‘ఆగడు' ప్లాఫ్ తో కాస్త డిజప్పాయింట్ అయిన శ్రీనువైట్ల ఆ తరువాత రామ్‌చరణ్‌తో రూపొందించిన ‘బ్రూస్‌లీ' కూడా బోల్తాపడటం పూర్తిగా నిరాసపడ్డారు. అయితే డక్కా మొక్కీలు తిన్న దర్సకుడు కావటంతో మళ్లీ లేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు.

Srinu Vytla Not Teaming Up With Sudheer Babu

ఈ క్రమంలో మళ్లీ కోల్పోయిన తన ఇమేజ్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఈ లోగా ఆయనపై రూమర్స్ మొదలయ్యాయి. శ్రీనువైట్ల సుధీర్‌బాబు హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు జరిగాయని, మహేష్ తన సొంత బ్యానర్ పై ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నాడని.

అయితే ఈ రూమర్స్ ని హీరో సుధీర్ బాబు తన ట్వీట్టర్ ఎక్కౌంట్ ద్వారా వెంటనే ఖండించారు. తాను అసలు ఈ మధ్యన శ్రీను వైట్లను కలవలేదని తేల్చి చెప్పారు. అయితే ఆ విషయం పెద్దగా వెలుగులోకి రాక ఆ రూమరే వెబ్ మీడియాలో కంటిన్యూ అవుతోంది. దాంతో శ్రీను వైట్ల ఈ కొత్త తల నొప్పి ఏంటిరా అని తలపట్టుకుంటున్నట్లు సమచారం.

దానికి తోడు ఈ న్యూస్ చదివి శ్రీను వైట్లకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పేవారు, బెస్టాఫ్ లక్ చెప్పేవారు, ఆఫర్ అడిగే నటులు, టెక్నిషియన్స్ కాల్స్ ఎక్కువయ్యాయట. దాంతో శ్రీను వైట్ల ఈ రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరా అని మండిపడుతున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X