»   » నాగచైతన్య అన్నయ్యగా ఆ హీరో కన్ఫర్మ్...

నాగచైతన్య అన్నయ్యగా ఆ హీరో కన్ఫర్మ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, అజయ్ భుయాన్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో హీరో అన్నయ్య పాత్ర కోసం తమిళ నటుడు శ్రీరామ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఒకరికి ఒకరు చిత్రంలో చేసిన శ్రీరామ్ ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ సంపాదించుకోలేకపోయారు. అడపాదడపా తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో కనిపించే శ్రీరామ్ అయితే తమ పాత్రకు సరిపోతుందని దర్శక, నిర్మాతలు భావించారుట. ఇక ఈ చిత్రంలో అన్నయ్య పాత్ర కీ రోల్ ప్లే చేయనుంది. కథ ప్రకారం ఇండియాలో కాజల్ తో ప్రేమలో పడ్డ నాగచైతన్య అనుకోని పరిస్దితుల్లో బ్యాంకాక్ లో అన్నయ్య దగ్గరికి వెళ్ళతాడని అక్కడనుండి కథ మలుపు తిరుగుతుందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేసే ఈ చిత్రంలో అన్నయ్య పాత్రపై క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందని అదే హైలెట్ అవుతుందని, అందుకే ఆ పాత్రకు చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాల్సివస్తోందని చెప్పుకుంటున్నారు. ఇక అజయ్ భుయాన్ రూపొందించిన హౌస్ ఫుల్ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అలాగే ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu