For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదెక్కడి కాంబినేషన్ రా బాబూ.. సోషల్ మీడియాకు నిప్పుపెట్టారు.. చెర్రీ, జక్కన, తారక్ ఫోటో వైరల్

  By Rajababu
  |
  A photo goes viral on Internet : రాంచరణ్, NTR,మహేశ్‌ మల్టీస్టారర్ ?

  బాహుబలి సినిమా తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు జక్కన షాకిచ్చారు. ఇటీవల మెగాపవ్ స్టార్ రాంచరణ్, యంగ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాకు నిప్పు పెట్టినంత పనిచేసింది.

  నిన్ను వదలం జక్కన్న

  నిన్ను వదలం జక్కన్న

  రాజమౌళి మధ్యలో కూర్చొని ఉండగా ఒకవైపు రాంచరణ్, మరోవైపు ఎన్టీఆర్ పట్టేసుకొన్నారు. నాతోనే సినిమా చేయాలి. మనం సినిమా చేద్దా అనే రేంజ్‌లో నిన్ను వదలను బొమ్మాలి అనే అంతగా ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్‌చల్ రేపుతున్నది.

   ఎన్టీఆర్, రాజమౌళి సినీ ప్రయాణం

  ఎన్టీఆర్, రాజమౌళి సినీ ప్రయాణం

  సినీ దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్ ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1తో ప్రారంభమైంది. ఆ తర్వాత తీసిన సింహాద్రి జక్కన్నను, తారక్‌ను అగ్ర హీరో, దర్శకుడిగా మార్చేశాయి.

   మళ్లీ జక్కన్నతో కాంబినేషన్ ఎప్పుడు?

  మళ్లీ జక్కన్నతో కాంబినేషన్ ఎప్పుడు?

  ఆ తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ సెన్సేషనల్ సక్సెస్‌ను సాధించింది. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

   రాంచరణ్ గ్రాఫ్ పెంచిన రాజమౌళి

  రాంచరణ్ గ్రాఫ్ పెంచిన రాజమౌళి

  ఇక రాంచరణ్‌ను సినిమా గ్రాఫ్‌ను పెంచిన సినిమా మగధీర. ఈ చిత్రం రాజమౌళి దర్శక ప్రతిభకు మెరుగులు దిద్దిన చిత్రం. బాహుబలి లాంటి సినిమాపై ఆలోచన పెట్టడానికి ఓ కారణమైన సినిమాగా మగధీరను చెప్పుకొంటారు. అలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ రాజమౌళి, రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. వీరి కలయికలో సినిమా వస్తే ఎంత బాగుంటుందో అనే ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

   రాజమౌళి మల్టీస్టారర్ సినిమా

  రాజమౌళి మల్టీస్టారర్ సినిమా

  ఇదిలా పక్కన పడితే.. బాహుబలి తర్వాత కమిట్‌మెంట్ ప్రకారం డీవీవీ దానయ్యతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉన్నది. రాజమౌళి తదుపరి సినిమా మల్టీస్టారర్ అని మీడియాలో ఓ వార్త కొంత కాలంగా ప్రచారం అవుతున్నది. ఆ మధ్యలో ప్రిన్స్ మహేశ్, మరో హీరో కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్త వినిపించింది. అయితే దానయ్య సినిమా తర్వాత ప్రిన్స్ మహేశ్‌తో సినిమా ఉంటుంది అని రాజమౌళి వివరణ ఇవ్వడం మల్టీస్టారర్ చిత్రంలో మహేశ్ ఉండరని స్పష్టమైంది.

   చెర్రీ, తారక్‌తో జక్కన్న

  చెర్రీ, తారక్‌తో జక్కన్న

  అయితే తాజాగా రాంచరణ్, ఎన్టీఆర్‌తో రాజమౌళి సమావేశమవ్వడంతో జక్కన తీయబోయే మల్టీస్టారర్ చిత్రం వీరితోనేనా అనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఒకవేళ అదే నిజమైతే టాలీవుడ్‌లో రాజమౌళి మరో సంచలనం సృష్టించినట్టే.

   రామాయణం ఎక్కడ

  రామాయణం ఎక్కడ

  అల్లు అరవింద్ నిర్మాతగా రాంచరణ్ హీరోగా ప్రారంభించాలనుకొన్న రామాయణం సినిమా అడ్రస్ లేకుండా పోయింది. రాంచరణ్ రాముడిగా కనిపించనున్నారని, అప్పట్లో ఫస్ట్‌లుక్ కూడా మీడియాలో హడావిడి చేసింది.

   మహాభారతంపై క్లారిటీ

  మహాభారతంపై క్లారిటీ

  ఇక బాహుబలి తర్వాత రాజమౌళి మహాభారతం తీయనున్నారనే విషయం మీడియాలో నానింది. అందులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారనే వార్త ప్రచారమైనా.. ఇప్పట్లో మహాభారతం తీసే ఉద్దేశం లేదు అని రాజమౌళి స్పష్టత ఇచ్చారు.

   ముగ్గురి కలయికపై అనేక ప్రశ్నలు

  ముగ్గురి కలయికపై అనేక ప్రశ్నలు

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ముగ్గురు ఎందుకు కలిశారు. రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారా? అది సోషియో ఫాంటసీనా లేక రెగ్యులర్ కమర్షియల్ సినిమానా అనే విషయంపై అనేక ప్రశ్నలు లేస్తున్నాయి. ఈ ఫోటో వెనుక కథను ఎవరైనా వివరిస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే.

  English summary
  SS Rajamouli, NTR, Ram Charan photo goes viral on Internet.This photo sets fire in Social media too. After Rajamouli post, Lot of news floodingon the Internet.Reports and rumours suggest that Ram Charnan, NTR are in Rajamouli's next Multi starrer movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X