»   » రాజమౌళి చిత్రంలో శ్రీదేవి, ప్రముఖ నటుడు.. ద్వేషం పెంచుకొను.. వివాదానికి చెల్లుచీటి..

రాజమౌళి చిత్రంలో శ్రీదేవి, ప్రముఖ నటుడు.. ద్వేషం పెంచుకొను.. వివాదానికి చెల్లుచీటి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అనేక విమర్శలకు లోనయ్యారు. బాహుబలి చిత్రం రాజమౌళి, శ్రీదేవి మధ్య అఘాతాన్ని పెంచింది. ఓ భారీ చిచ్చును రేపింది. ఇటీవల ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. బాహుబలి చిత్రంలోని శివగామి పాత్ర కోసం శ్రీదేవిని ప్రయత్నింగా ఆమె గొంతెమ్మ కోర్కెలు కోరింది అని వ్యాఖ్యానించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడి శ్రీదేవికి రాజమౌళి క్షమాపణలు చెప్పారనే వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రీదేవితో ఏర్పడిన అఘాతాన్ని పూడ్చుకోవడానికి తన తదుపరి చిత్రంలో ఆమెను తీసుకొన్నట్టు ఓ వార్త ఇంటర్నెట్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

 వివాదమైన రాజమౌళి కామెంట్లు

వివాదమైన రాజమౌళి కామెంట్లు

రాజమౌళి ఇటీవల శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాం. అయితే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా లాభాల్లో వాటా కూడా ఇవ్వాలి. ఓ హోటల్‌లో పలు రూమ్‌లు బుక్ చేయాలి అనే డిమాండ్లు పెట్టింది. ఒకవేళ ఆమెతో సినిమా చేస్తే బాహుబలి ఫ్లాప్ అయ్యేది అనే విధంగా రాజమౌళి మాట్లాడినట్టు వచ్చిన వార్తలు మీడియాలో సంచలనం రేపాయి.

SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
నేను ద్వేషం పెంచుకోను

నేను ద్వేషం పెంచుకోను

రాజమౌళి వ్యాఖ్యలపై శ్రీదేవి కూడా స్పందించింది. ఆ తర్వాత రాజమౌళి క్షమాపణలు చెప్పినట్టు వార్తలు రావడంతో ఆ వివాదం సద్దుమణిగింది. నేను వ్యక్తిగతంగా ఒకరిపై ద్వేషం పెంచుకొను. ఆయన అలా మాట్లాడుతారని నేను ఊహించలేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నేను పోషించని పాత్రల గురించి నేను పెద్దగా పట్టించుకోను. నటిగా నేను సవాళ్లను ఎదుర్కోవడమే నాకు ఇష్టం.

మామ్ సక్సెస్ జోష్ పెరిగింది..

మామ్ సక్సెస్ జోష్ పెరిగింది..

మామ్ చిత్రం అద్భుతమైన అనుభూతిని పంచింది. ఆ సినిమా సక్సెస్‌ నాలో జోష్ పెంచింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను పోషించడానికి ఎప్పుడూ ముందుంటాను. విభిన్నమైన పాత్రల కోసం ఎదురు చూస్తుంటాను అని శ్రీదేవి అన్నారు. పాత్ర బాగుంటే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను అని ఆమె అన్నారు.

 శ్రీదేవితో రాజమౌళి సంప్రదింపులు

శ్రీదేవితో రాజమౌళి సంప్రదింపులు

బాహుబలి2 చిత్రం తర్వాత తదుపరి చిత్రంపై రాజమౌళి దృష్టిపెట్టారు. కథ, కథనాలపై జక్కన్న కసరత్తు చేస్తున్నట్టు సమాచారం వెలువడుతున్నది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటుడు మోహన్‌లాల్, శ్రీదేవిని సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాపై త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సినీ ప్రేక్షకులకు పండుగేననే మాట వినిపిస్తున్నది.

సెప్టెంబర్‌లో చైనాలో బాహుబలి రిలీజ్

సెప్టెంబర్‌లో చైనాలో బాహుబలి రిలీజ్

రాజమౌళి తన తదుపరి చిత్రంపై కసరత్తు చేస్తూనే చైనాలో బాహుబలి2 సినిమాను రిలీజ్ చేసే అంశంపై దృష్టిపెట్టారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దంగల్ చిత్రానికి చైనాలో భారీ స్పందన రావడంతో బాహుబలి చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Baahubali director SS Rajamouli is planning to cast Mohanlal and Sridevi in his forthcoming film. After success of Baahubali 2, SS Rajamouli has begun work on his next film. Reports suggest that Rajamouli all set to team up with Mollywood megastar Mohanlal, Sridevi for next movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu