»   » ఆ బాలీవుడ్ హీరోయిన్ ని తెస్తేనే నా డేట్స్...స్టార్ హీరో డిమాండ్, తలపట్టుకున్న నిర్మాత

ఆ బాలీవుడ్ హీరోయిన్ ని తెస్తేనే నా డేట్స్...స్టార్ హీరో డిమాండ్, తలపట్టుకున్న నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు బ్యానర్ వ్యాల్యూ ఉండేది. ఫలానా బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది. అప్పుడు నిర్మాత కు సినిమాకు సంభందించిన ప్రతీ విషయంలోనూ పై చేయి ఉండేది. అతనే నిర్ణయాలు తీసుకోగలిగేవాడు. కానీ రోజులు మారాయి.

తర్వాత డైరక్టర్స్ రాజ్యం వచ్చింది. డైరక్టర్ ఫొటో పోస్టర్ పై చూసి జనం ధియోటర్ కు వెళ్లటం మొదలెట్టారు. ఆ హవా చాలా కాలం నడిచింది. స్టార్ డైరక్టర్స్ కాంబినేషన్ లో చేయటానికి హీరోలు, నిర్మాతలు ఉత్సాహం చూపించేవారు. దర్శకుడు ఏది చెపితే అది సెట్ లో జరిగేది. ఆ రోజులూ మారాయి.

ఇప్పుడు హీరోలదే సినిమాకు సంభందించిన అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే అధికారం. అతను ఎవరికి డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అని నిర్మాతలు అంతా అతని ఇంటి చుట్టూ తిరిగే పరిస్దితి. హీరో నాకు ఫలానా డైరక్టర్ కావాలనే అతన్నే పెట్టుకుని సినిమా చేయాలి. దాంతో డైరక్టర్స్ ని,నిర్మాతను చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాడు హీరో.

Star Hero wants to be paired with Bollywood actress

సినిమా కు అయ్యే ఖర్చు నుంచి, లొకేషన్స్ దగ్గర నుంచి హీరో నిర్ణయమే అమలు జరుగుతోంది. ఫలానా హీరోయిన్ ని నా ప్రక్కన తీసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడైనా నిర్మాత తేవాల్సిందే. లేకపోతే ఆ హీరో తమకు డేట్స్ ఇవ్వడు. ఇదీ నేటి పరిస్దితి.

ఈ పరిస్దితుల్లో ఓ స్టార్ హీరో తమకు బాలీవుడ్ కు చెందిన ఫలానా స్టార్ హీరోయిన్ ని తీసుకు వస్తేనే డేట్స్ ఇస్తానని పట్టుబడుతున్నారట. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన ఆ నిర్మాత ఆ బాలీవుడ్ హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నాడని సమాచారం. ఆమె మాత్రం నా రెమ్యునేషన్ ఇంత అని భారిగా చెప్పిందట.

అప్పటికీ ఆమె కాకుండా వేరే వారిని తెద్దామని నిర్మాత కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసారట. డైరక్టర్ కూడా ..హీరో గారు చెప్పిన బాలీవుడ్ భామ అయితే తమ ప్రాజెక్టుకు ఫెరఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని వాదిస్తున్నారట. అటు చూస్తే ఆ హీరోయిన్ రెమ్యునేషన్ చాలా ఎక్కువ అడగటమే కాక, రకరకాల డిమాండ్స్ చేస్తోందిట. అన్ని ఏర్పాట్లు చేసినా నేను బిజీ కాబట్టి కంటిన్యూ డేట్స్ ఇవ్వలేనంటోందిట.

ఏమిటీ ఈ హీరోగారు ఆమె అంటే అంత లా పట్టుబడుతున్నారు అంటే... ఆ హీరోయిన్ తమ భార్యకు స్నేహితురాలిట. ఆ రిలేషన్ నిలుపుకోవటానికి ఇలా నిర్మాతపై సదరు హీరో రుద్దుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. పేరు బయిటకు రావటానికి ఇష్టపడిని ఆ నిర్మాత ..డబ్బు పెట్టి, ఈ ఖర్మ ఏంటి అని తలపట్టుకుంటున్నాడట. అదీ సంగతి.

English summary
Tollywood star hero wants to be paired with Bollywood heroine in his next movie.One can imagine the pressure on a Producer in such circumstances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu