»   » మహేష్ బాబు, మురగదాస్, ఓ సాలీడు... ఈ రచ్చేంది బాబూ..నిజమేనా

మహేష్ బాబు, మురగదాస్, ఓ సాలీడు... ఈ రచ్చేంది బాబూ..నిజమేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని రూమర్స్ వింటూంటే ....నిజమేనా అన్నట్లు ఉంటాయి. కొన్ని చూడగానే ఈ పులిహార న్యూస్ ఏంటి అనిపిస్తుంది. తాజాగా మహేష్ , మురగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టీజర్ కు సంభందించిన ఓ వార్త వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్త చదివి..అది ఏ కోవకు చెందిందో మీరే డిసైడ్ చేయండి.


ఈ సినిమాలో కొన్ని రోబోటిక్స్ కూడా వాడుతున్నారట. వాటిలో ముఖ్యంగా ఒక రోబో సాలిపురుగు ఒకటి ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ చేయనున్న టీజర్లోనే ఈ రోబో సాలీడును ప్రపంచానికి చూపించాలని మహేష్ డైరక్టర్ మురుగుదాస్ ఫిక్సయ్యి , రెడీ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Stunning robotic spider in Mahesh Babu's Movie Teaser!

అందుకే ఇప్పుడు లండన్ లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారితో ఈ సాలీడు తాలూకు కంప్యూటర్ గ్రాఫిక్స్ 35 లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తున్నారట. ఆ సాలీవుడ్ విలన్ ఉన్న చోట ఉంటూ..అక్కడ జరిగే విషయాలన్నీ మన హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందిట. అచ్చం జేమ్స్ బాండ్ సినిమా తరహాలో అన్నమాట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ వినటానికి మాత్రం చాలా క్రేజీగా ఉంది కదూ. నిజం కాకపోతే ...ఈ రోబోటిక్ సాలీడు ఐడియా ఆలోచన వచ్చినవాడికి జోహార్లు చెప్పవచ్చు.

అలాగే ఈ సినిమాకు ''సంభవామి యుగే యుగే'' అనే టైటిల్ ను పెట్టినట్లు మొన్న నిర్మాత పివిపి ఇన్ డైరెక్టుగా కన్ఫామ్ చేసి సంచలనం క్రియేట్ చేసారు. మరో ప్రక్క..అదేం లేదు....అసలు అది మా టైటిల్ కాదంటూ ఆ సినిమా పి.ఆర్.ఓ ఇప్పుడు మీడియా వారికి ఎసెమ్మెస్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు.

గత యేడాది క్రిస్మస్ నుంచి ఈ సినిమా టీజర్ ఊరిస్తోంది. అయితే, ఈసారి మహాశివరాత్రి కానుకగా మహేష్ టీజర్ పక్కాగా రానుందని చెబుతున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగానే అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఈ టీజర్ యుకె లో రెడీ అవుతోంది. భారీ గ్రాఫికల్ వర్క్, హై క్వాలిటీతో సిద్ధం చేస్తున్నారు. 30 సెకన్ల నిడివి టీజర్ లో సినిమా స్టోరీ లైన్ ఏమిటనేది అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట మురగదాస్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మహేష్ - మురగ సినిమా తెలుగు, తమిళ్ బాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం సంభవామి, మహేష్ 23, ఏజెంట్ శివ, ఎనిమీ.. టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్లాన్ చేశాడు దర్శకుడు . ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, అహ్మాదాబాద్ నగరాల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా.. ముంభై, పూణే షెడ్యూల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం హరీజ్ జయరాజ్.

English summary
Director Murugadoss has come up with a unique idea for the Mahesh movie's teaser.The interesting element of the teaser is said to be a robotic spider.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu