»   » చిరంజీవిని, అరవింద్‌ను తాతల్ని చేసిన బన్నీ....!?

చిరంజీవిని, అరవింద్‌ను తాతల్ని చేసిన బన్నీ....!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ 'బన్నీ' చిత్రీకరణ సమయంలో బన్నీ చేతికి గాయమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ గాయానికి సంబంధించి చికిత్స కోసం ఇటీవలే అల్లు అర్జున్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. బన్నీ తనతో పాటు తన సతీమణి స్నేహ రెడ్డిని తోడుగా తీసుకువెళ్లాడు.

  సర్జరీ చేయించుకుని, ఇండియాకు తిరిగి వచ్చిన బన్నీ, వస్తూ.. వస్తూ.. అల్లు వారి కుటుంబానికి ఓ తీపి వార్తను మోసుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే.. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు మరో బుల్లి స్టైలిష్ స్టార్‌ని తెరపైకి ఆహ్వానించబోతున్నారు. అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తాతలు కాబోతున్నారట.

  ఇంకా అర్థం కాలేదా... మన బన్నీ త్వరలోనే తండ్రికాబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి స్నేహ రెడ్డికి ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆస్ట్రేలియాలోనే కన్ఫర్మ్ అయిందట. దీంతో ఇప్పుడు అల్లు వారి ఇంట ఆనందాల పంట పండుతోంది. బజ్జి అల్లు రామలింగయ్య పుట్టబోతున్నాడంటూ సినీ జనాలు సంబరాలు చేసుకుంటున్నారు.

  అల్లు అర్జున్‌కి స్నేహ రెడ్డి ఎంత ఇష్టమో మనకు తెలిసిన విషయమే. స్నేహను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ, ఇప్పుడు స్నేహ తల్లి కాబోంతుందని తెలియడంతో మరింత ప్రేమను కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం.. బన్నీ అంకుల్‌కి మనం కూడా కంగ్రాట్స్ చెబుదాం.

  English summary
  Stylish star Allu Arjun and his beloved wife are preparing to invite a new person into their life. Yes, the couple is expecting a baby soon. A reliable source had confirmed the news. It is known that Allu Arjun had recently gone to Australia for his shoulder surgery. He was accompanied by Sneha. According to the source, her pregnancy was confirmed there itself. After the successful surgery, the couple had returned home with a good news. And what then! There is no limit for the happiness of Allu family. The family is expecting Junior Allu Ramalingaiah soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more