»   » జగపతిబాబు నోటి దగ్గర కూడు లాగేసాడు?

జగపతిబాబు నోటి దగ్గర కూడు లాగేసాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లెజండ్ చిత్రంతో ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సెటిలవుతున్నాడు జగపతిబాబు. అయితే ఆయనకు పోటీ ఎదురవుతోంది. ఆయనకు అనుకున్న భారీ ఆఫర్ ని సుదీప్ తన్నుకుపోయిన్నట్లు చెన్నై వర్గాల సమచాారం. రజనీకాంత్ కొత్త చిత్రం లింగా లో విలన్ గా జగపతిబాబు ని అనుకున్నా...ఇప్పుడు దర్సక,నిర్మాతల దృష్టి మొత్తం సుదీప్ పై ఉందని సమాచారం. అందులోనూ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు సుదీప్ కు ఉన్న స్నేహం కూడా ఈ విషయంలో వర్కవుట్ అయ్యిందంటున్నారు. ఈ విషయంపై త్వరలో ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సుదీప్ సైతం ...ఈగ తమిళంలో హిట్ అవటంతో అక్కడ తన స్ధాన బలిమి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ చిత్రంలో సైతం విలన్ గా ఎంపిక అయ్యారు.

ఇక రజనీ లింగా చిత్రం ఈ రోజే ప్రారంభమైంది. రజనీకాంత్ నటించిన విక్రమ సింహ (తమిళంలో కొచ్చాడయాన్) ఇంకా విడుదల కాకముందే మరో సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా రజనీ కొత్తసినిమా 'లింగా' ప్రారంభమైంది.

Sudeep to clash with Rajini

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. తెల్ల సిల్కు లుంగీ, తెల్ల చొక్కా వేసుకుని వచ్చిన రజనీకాంత్ తో పాటు ఆయన స్నేహితుడు, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్, ఆయన సతీమణి సుమలత కూడా పూజా కార్యక్రమానికి వచ్చారు.

మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో ఈ పూజలు జరిగాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమాలో రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క ఇద్దరూ నటించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

రజనీ చిత్రం ప్రారంభం రోజు ఫ్యాన్స్ కు పండగే. చిత్రం విజయవంతం కావాలని కొన్ని చోట్ల పూజలు సైతం చేస్తూంటారు. ఇప్పటికే విక్రమ్ సింహా చిత్రం పై మంచి అంచనాలు పెట్టుకుని విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ కొత్త చిత్రం మరింత ఊపుని ఇచ్చింది. విక్రమ్ సింహా అనంతరం ఆయన రిటైర్ అయిపోతారేమో అనే సందేహాలకు తెరపడినట్లైంది.

English summary
It appears that work on film-maker K.S. Ravikumar’s film starring Sudeep in the lead would commence only after the celebrated director wraps up the shoot of Lingaa, which stars superstar Rajinikanth, Anushka and Sonakshi Sinha in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu