»   » వర్మ 'అప్పా' టైటిల్ రోల్ వేస్తున్న హీరో ఎవరంటే...

వర్మ 'అప్పా' టైటిల్ రోల్ వేస్తున్న హీరో ఎవరంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాఫియా చిత్రాలతో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా అప్పా అనే కన్నడ చిత్రానికి శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఇదో మాఫియా డాన్ జీవిత చరిత్ర. ఈ చిత్రాన్ని ఆయన ఆయన అండర్ వరల్డ్ బాహుబలి గా అభివర్ణించారు. ఇంతకీ ఈ బెంగుళూరు మాఫియా డాన్ ఎవరు చేయబోతున్నారూ అంటే కన్నడ హీరో ఈగ ఫేమ్ సుదీప్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో సుదీప్ ..వర్మ కాంబినేషన్ లో ఫూంక్ చిత్రం వచ్చింది. ప్రస్తుతం అప్పా ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముత్తప్పరాయ్ ..నా దృష్టిలో అండర్ వరల్డ్ బాహబలి అన్నారు. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను..గాఢ్ ఫాధర్ అనేది ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ అని..కానీ ముత్తప్ప రాయ్ ని కలిసిన తర్వాత ..ఆయన నిజమే అని..ఆయన గాఢ్ ఫాదర్స్ కు గాఢ్ ఫాధర్ అని తెలుసుకున్నాను. ఈ సినిమాకు ‘అప్పా' అనే పేరు పెడతా . ఫాదర్ ఆఫ్ ఆల్ ది గాడ్‌ఫాదర్స్ అనేది ట్యాగ్‌లైన్.

Sudeep is RGV Appa?

బెంగళూరు నేపథ్యంలో అండర్ వరల్డ్‌కు సంబంధించిన వారి గురించి తెలుసుకోవడం జరిగిందని, ముంబై అండర్ వరల్డ్ కంటే ఈ బెంగళూర్ అండర్ వరల్డ్ ఇంకా ఎక్కువ బలమైనదని వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముత్తప్పా రాయ్ అనే బెంగళూరుకు చెందిన, గతంలో అండర్ వరల్డ్ డాన్‌గా పేరుమోసిన వ్యక్తిని. దావూద్ కంపనీ కన్నా పెద్దదైన బీ-కంపనీ ఇది..

రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం గంధపు చెక్కల స్మగ్లర్ .. వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరి మన్ననలూ అందుకుంటోంది.

English summary
Rgv sometime back announced that he is coming with a film titled ‘Appa’ based on Bangalore mafia don Muttappa Raj. According to the latest it is coming out that Kicha Sudeep will be seen in the lead role in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu