»   » దర్శకుడి భార్య మ్యాటర్లో...హీరో సుధీర్ బాబు జోక్యం?

దర్శకుడి భార్య మ్యాటర్లో...హీరో సుధీర్ బాబు జోక్యం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ప్రేమ కథా చిత్రమ్'తో హిట్ కొట్టిన హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'ఆడు మగాడ్రా బుజ్జి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు గురించి ఓ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి కాస్టూమ్ డిజైనర్‌గా ఈ చిత్ర దర్శకుడి భార్య పని చేస్తున్నారు. సుధీర్ బాబును సరికొత్త లుక్‌తో చూపించడానికి తన వంతు ప్రయత్నం ఆమె చేస్తున్నారు.కారణమేంటో తెలియదు కానీ....ఆమెను ఉన్నట్టుండి తొలగించారు నిర్మాతలు. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆమె తొలగింపు వెనక సుధీర్ బాబు ప్రమేయం ఉందని, ఆయన సూచన మేరకే ఈ మార్పు జరిగిందని టాక్. దర్శకుడు కొత్తవాడు కావడంతో సుధీర్ బాబు చర్యను ఎదురు ప్రశ్నించ లేక పోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా అంతర్గత విషయం కావడంతో ఈ విషయమై యూనిట్ సభ్యులు ఎవరూ నోరు విప్పడం లేదు. టెక్నికల్ విభాగంలో హీరోలు జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సినిమా విషయానికొస్తే...కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కొద్దిపాటి యాక్షన్, పూర్తి స్ధాయి ఫన్, రొమాన్స్ తో చిత్రం జనరంజకంగా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీ, కెమెరా:శాంటోనియో ట్రె జియో, ఆర్‌ట:నారాయణరెడ్డి, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary
Buzz is that Sudheer Babu, who is currently doing 'Aadu Magadra Bujji', has gone to the extent of getting the names of crew changed as per his wishes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu