»   »  నాగచైతన్య నో అంటే...సుధీర్ బాబు సై అన్నాడు

నాగచైతన్య నో అంటే...సుధీర్ బాబు సై అన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sudheer and Nanditha Back For Charminar
హైదరాబాద్ : ఒక్కోసారి ఒక హీరో నో చెప్పటం, మరో హీరోకు కలిసివస్తుంది. ఇప్పుడు అదే పరిస్ధితి నాగ చైతన్యకు ఎదురైంది. అతను నో చెప్పిన ప్రాజెక్టు కన్నడ రీమేక్ ఛార్మినార్. ఇప్పుడా ప్రాజెక్టు సుధీర్ బాబు దగ్గరకి చేరింది. సుధీర్ బాబు పరిస్ధితి ఆడు మగాడురా బుజ్జీ తర్వాత ఏమీ బాగాలేదు. అతని జోలికి ఎవరూ పోవటం లేదు. చేతిలో ఉన్న ఒక్క ప్రాజెక్టు మాయదారి మల్లిగాడు సైతం షూటింగ్ ఆగిందని సమాచారం. ఈ నేపధ్యంలో అతను ఈ రీమేక్ తన దగ్గరకు రావటంతో ఆనందంతో తల మునకలు అవుతున్నాడు.

ఛార్మినార్ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ రీమేక్ చేస్తున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన చుండ్రునే ఈ చిత్రానికి సైతం డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

ఇక తడాఖా'తో మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని ఈ నెల్లోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్‌ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్‌ వర్సెస్‌ కౌర్‌' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు.

English summary

 
 Charminar was supposed to be remade with Naga Chaitanya as its hero. But, due to the dates issue, Chaitu has to back out of this project and it landed up with Sudheer Babu now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X