»   » ‘స్వామి రా.. రా...' దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఖరారు..

‘స్వామి రా.. రా...' దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఖరారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'స్వామి రా.. రా...' వంటి చిన్న చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ తదుపరి చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఆ మధ్య అల్లు అర్జున్ తో,ఎన్టీఆర్ తో చిత్రాలంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమచారం ప్రకారం నాగచైతన్య హీరోగా నెక్ట్స్ చిత్రం మొదలుకానుందని తెలుస్తోంది. రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రం తో హిట్ కొట్టిన ఛత్రపతి బి.వియస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ ఆ స్క్రిప్టుతో బిజీగా ఉన్నాడని చెప్తున్నారు.

ఇక తడాఖా చిత్రం విజయంతో జోరు మీద ఉన్న నాగచైతన్య వరస సినిమాలు కమిటవుతున్నారు. ఆయన కొత్త చిత్రం దసరా రోజు ప్రారంభం కానుంది. హన్సిక హీరోయిన్ గా చేయనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి డైరక్ట్ చేయనున్నారు.వరుణ్ మరియు తేజ శ్రీ శుభ శ్వేత ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తారు. ఆకుల శివ కథ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సి.కళ్యాణ్ ఈ చిత్రం సమర్పిస్తారు. ఇక ఇన్ని రోజులుగా నాగచైతన్య,శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ చిత్రం హలో బ్రదర్ రీమేక్ అని వినపడింది. అయితే అది కాదు కొత్త కథ అని తెలుస్తోంది. నాగచైతన్య, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో రూపొందే సినిమా 'హలోబ్రదర్' రీమేక్ కాదు. ఆకుల శివ తయారు చేసిన ఓ మాస్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీనివాసరెడ్డి.

అలాగే నాగచైతన్య మరో హిట్ దర్శకుడితో జతకట్టబోతున్నాడు. ఇటీవల నితిన్‌తో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండ త్వరలో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పతాకంపై నాగార్జున అక్కినేని ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. అక్బోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్టు వర్కుపై దృష్టి పెట్టాడు. ఇది పూర్తయిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది.

మరో వైపు... నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు...ప్రముఖ నిర్మాత రామానాయుడు తన మనవడు నాగ చైతన్య (కూతురు కొడుకు)హీరోగా సినిమా చేయబోతున్నాడు. పంజాబీ హిట్ మూవీ 'సింగ్ వర్సెస్ కౌర్' చిత్రానికి రీమేక్ గా రూపొందబోయే ఈ చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మించబోతున్నారు.

English summary
Naga Chaitanya is set to team up with director Sudheer Varma who shot to fame with his debut film Swamy Ra Ra that featured Nikhil and Swathi in the leads. Now, Sudheer Varma is currently working on a new script for Naga Chaitanya to be produced by BVSN Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu