»   »  టైటిల్ లోనే మరీ అంత వెనక్కి వెళ్లిపోతే ఎలా?

టైటిల్ లోనే మరీ అంత వెనక్కి వెళ్లిపోతే ఎలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Sudhir Babu's next titled .. Krishnamma Kalipindi Iddarini
హైదరాబాద్ : సినిమా టైటిల్స్ పెట్టేడప్పుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ కాలం యువతకు అది రీచ్ అవుతుందా లేదా అన్నది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. తాజాగా 'ప్రేమ కథా చిత్రమ్'తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సుధీర్‌బాబు-నందిత మళ్లీ మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' అనే టైటిల్ అనుకుంటున్నారు. సినిమా ఫీల్ తో సాగే కథ కాబట్టి టైటిల్ ని సైతం అలా కవితాత్మకంగా పెట్టారంటున్నారు. బంగారు బొమ్మలు చిత్రం కోసం 1977 లో స్వరపరిచిన పాట లోంచి తీసుకున్న ఈ టైటిల్ ఎంతవరకూ యూత్ కి పడుతుందనేది ఆలోచించాల్సిన విషయం అంటున్నారు.

పాత పాటలని టైటిల్ గా పెట్టడం, రీమిక్స్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ అనుసరిస్తున్న ట్రెండ్. అయితే ఇవి ఎంతవరకూ రెగ్యులర్ సినీ ప్రేక్షకుడుకి కనెక్టు అవుతాయనేది మాత్రం సందేహమే. ఆ రోజుల్లో ఎంత సూపర్ హిట్ సాంగ్ అయినా స్పీడు పెరిగిన ఈ రోజుల్లో ఈ కాలం యూత్ కి ఆ పాట తెలియాలని లేదు. ఇరవై ఏళ్ల లోపు యూత్ కనెక్టు కాకపోతే థియోటర్స్ కళకళలాడటం లేదు. కాదు మా సినిమా నలభైల్లో పడిన వారికే అంటే సమస్య లేదు. కాబట్టి ఫీల్ వస్తుంది కదా అని పాత టైటిల్స్ పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు.

కన్నడంలో ఘనవిజయం సాధించిన 'చార్మినార్'కి ఇది రీమేక్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, శిరీష ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కన్నడ వెర్షన్‌కి దర్శకుడైన ఆర్. చంద్రు తెలుగు వెర్షన్‌నీ డెరైక్ట్ చేయబోతున్నారు.

ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

English summary
Sudhir Babu, Nandita are teaming again under the direction of R.Chandu. The film is a remake of Kannada hit Charminar. The film is titled Krishnamma Kalipindi Iddarini and is produced by Lagadapati Sridhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu