»   » బాలకృష్ణ 'లెజండ్' లో సుహాసిని పాత్ర

బాలకృష్ణ 'లెజండ్' లో సుహాసిని పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . ఈ చిత్రం లో సుహాసిని ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. అది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది. రీసెంట్ గా బాలకృష్ణ,సుహాసిని ల మీద స్పెషల్ గా వేసిన సెట్ లో కీలకమైన సన్నివేశాలు తీసినట్లు సమాచారం. ఇక ఈ కాంబినేషన్ లో గతంలో చాలా చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఆ నేఫధ్యంలో ఆమెను పిలిచి ఈ పాత్రను ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

రెండో సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారం నుంచి విశాఖపట్నంలో జరగబోతోంది. వారాహి చలనచిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి బాలకృష్ణ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రతినాయకునిగా జగపతిబాబు నటిస్తుండటం విశేషం.

సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ "పూర్తిస్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు బోయపాటి సామాజిక అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు.ఇందులో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ మోటార్ సైకిల్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. షూటింగ్ మొత్తాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ 'సింహా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్యతో తాను చేస్తున్న సినిమా కావడంతో అభిమానులకు దీనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. "వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని రూపొందుతోంది'' అని ఆయనన్నారు.

English summary
Veteran actress Suhasini is playing an imperative role in Nandamuri Balakrishna’s upcoming movie “Legend”. Now the news is that Suhasini is playing a role of powerful Police Officer in this film. Recently film makers have canned the crucial scenes on Balakrishna and Suhasini in a specially erected set in Hyderabad. Radhika Apte and Sonal Chauhan are playing female lead roles and Devi Sri Prasad is scoring music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu