సుజీత్ నెక్ట్స్ ఫిల్మ్.. OG తర్వాత నానితో.. టైటిట్ కూడా ఫిక్స్, షూటింగ్ ఎప్పుడంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా సుజిత్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. అందుకు కారణం ఆయన 3వ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించడం. చిన్న వయసులోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ ను డీల్ చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ టాలెంట్ కు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో They Call Him OG అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం సెప్టెంబర్ 25న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఆయనకు ఇది డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ అలరించింది. తదితర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్ అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి వారు నటించడం విశేషం. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ డీడీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపుదిద్దుకుంది.

Sujeeth Next Movie with Tollywood Natural Star Nani

భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడంతో భారీగానే ఖర్చయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మొత్తానికి ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ నుంచి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ సుజిత్ డైరెక్ట్ చేయబోయే సినిమా ఏంటి అని టాలీవుడ్ లో చర్చ కొనసాగుతోంది. దీనిపై ఆసక్తికరమైన విషయాలు అందాయి.

యంగ్ డైరెక్టర్ సుజిత్ నెక్స్ట్ సినిమా మాత్రం టాలీవుడ్ నేషనల్ స్టార్ నానితో అని మాత్రం ఫిక్స్ అయింది. ఇప్పటికే నాని తో తీయబోయే సినిమాకు సంబంధించిన కథను కూడా దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడని తెలుస్తోంది. ఇక నాని డేట్స్ ఇవ్వడమే మిగిలి ఉంది. కానీ ప్రస్తుతం నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే సుజీత్ దర్శకత్వంలో నాని నటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నానని సుజిత్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వస్తున్నారు.

నాని ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకునే సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకోవలసిన చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయబోతున్నారు సుజిత్. 2026 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ పట్టాల యొక్క పోతుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సుజిత్ ఒక క్రేజీ టైటిల్ ని లాక్ చేశారని ప్రచారం జరుగుతుంది. బ్లడీ రోమియో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. ఇక మునుమందు మార్పులు చేర్పులపై అప్డేట్స్ రానున్నాయి.

More from Filmibeat

Read more about: sujeeth og movie nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X