»   »  తేల్చుకోలేక సుకుమార్, నిర్ణయం చరణ్ కే

తేల్చుకోలేక సుకుమార్, నిర్ణయం చరణ్ కే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లెక్కలు మాస్టారు సుకుమార్ కు లెక్కలు కుదరటం లేదని తెలుస్తోంది. ఆయన తన తదుపరి చిత్రం నిర్మాత విషయంలో చాలా డైలమోలో ఉన్నట్లు చెప్తున్నారు. లైఫ్ ఇచ్చిన వారితోనా లేక లాంగ్ లైఫ్ కోసమా అనే డైలమోలో సుకుమార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు చెప్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాని ప్రకారం...ఎన్టీఆర్ హీరోగా, సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది. ఈ సినిమా లో ఎన్టీఆర్ ని చాలా స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయిన ఈ దర్శకుడికి చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ వస్త్తున్నాయి. సుకుమార్ అందులో ఒకదానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

అదేంటంటే రామ్ చరణ్ తో సినిమా ఓకే అయ్యిందిని, కాకాపోతే సమస్య మాత్రం ప్రోడ్యూసర్ తోనే వస్తోందిని తెలుస్తోంది. సినిమాను నిర్మంచలేక కాదు, నిర్మణం ఎవరితో చేస్తారనేదే సమస్య. ఈ సినిమా కోసం ఇద్దరు బడా నిర్మతలు పోటిపడుతున్నారు.

 Sukumar dilemma with two producers

అందుతో ఒకరు సుకుమార్ కు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు కాగా, మరోకరు సినిమాను నిర్మించడంలో ఎంత ఖర్చుకైనా వెనుకాడని శ్రీమంతుడు ప్రోడ్యూసర్, లాంగ్ లైఫ్ కోసం ఇతనితో చేస్తాడో ఇంకా తెలాల్సి వుంది. మరి దీనిపై డెసిషన్ రామ్ చరణ్ కే వదిలినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే ఈ సినిమా మెదలు పెట్టలేరు. దీనికి రెండు కారణాలు, ఒకటి సుకుమార్ ప్రస్తుతం హాలీడేస్ లో వుండటం, మరోకటి రామ్ చరణ్ తని ఒరువన్ సినిమా రీమెక్ తో బిజిగా వుండటం. సో ఈ కారణాలతో ఈ సినిమా పట్టాలెక్కడానికి సుమారు మరో ఆరు నెలలు వెయిట్ చెయ్యాల్సిందే అని అంటున్నాయి సినిమా వర్గాలు.

English summary
Sukumar has commitments with two producers - the producers of "Srimanthudu" and Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu