»   » రంగస్థలం తర్వాత చిరంజీవితో సినిమా.. సుకుమార్ క్లారిటీ..

రంగస్థలం తర్వాత చిరంజీవితో సినిమా.. సుకుమార్ క్లారిటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా రాంచరణ్, సమంతతో రూపొందించిన చిత్రం రంగస్థలం సినిమా రిలీజ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. రంగస్థలం చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ విషయంపై సుకుమార్ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

ఆమెతో ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది...!
 చిరంజీవితో సినిమా

చిరంజీవితో సినిమా

చిరంజీవితో సినిమా తీసే అవకాశం అనేది నిజంగా అద్భుతమైన ఛాన్స్. కానీ ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్త కేవలం గాసిప్ మాత్రమే. చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మెగాస్టార్‌తో కలిసి పనిచేయడమనేది ఓ కల అని సుకుమార్ అన్నారు.

చిరంజీవిని సంప్రదించలేదు

చిరంజీవిని సంప్రదించలేదు

చిరంజీవితో సినిమా రూపొందించాలనే ఆశ ఉంది. కానీ ఇప్పటివరకు ఆయనను సంప్రదించలేదు. అవకాశం వస్తే చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను అని సుకుమార్ తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం.

సైరా బిజిలో చిరంజీవి

సైరా బిజిలో చిరంజీవి

ప్రస్తుతం చిరంజీవి చారిత్రాత్మక చిత్రం సైరా నర్సింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 ఘన విజయం తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రమిదే. ఆ తర్వాత చిరంజీవి నటించే చిత్రంపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో సుకుమార్ చిత్రానికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది.

 30న రంగస్థలం రిలీజ్

30న రంగస్థలం రిలీజ్

1980 గ్రామీణ వాతావరణంతో దర్శకుడు సుకుమార్ రూపొందించిన రంగస్థలం చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది.

English summary
Sukumar given clarity on Chiraneevi's movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X