»   » నిజమా...లేక తెలివిగా క్రియేట్ చేసిన రూమరా?

నిజమా...లేక తెలివిగా క్రియేట్ చేసిన రూమరా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : '1 నేనొక్కడినే' చిత్రంతో భాక్సాఫీస్ వద్ద దెబ్బతిన్న సుకుమార్ ఈ సారి పక్కా కమర్షియల్ స్క్రిప్టుతో సిద్దమయ్యాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చిత్రం అనుకున్నా అది మెటీరియలైజ్ కాలేదు. అల్లు అర్జున్ తో చిత్రం అని వార్తలు వచ్చాయి కానీ ఊహించని విధంగా అల్లుడు శ్రీను చిత్రంతో పరిచయమవుతున్న కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఫైనల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. దానికి తోడు బెల్లంకొండ శ్రీనివాస్ కి నటనలో ఈజ్ కూడా ఉందని అనిపించటంతో కథని నేరేట్ చేసారని చెప్పుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే మరికొద్ది నెలల్లో ఈ ప్రాజెక్టు విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం అంటున్నారు. అయితే ఇది నిజమా లేక కావాలని క్రియేట్ చేసిన రూమరా అనేది తెలియాల్సి ఉంది.

బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ని అల్లుడు శ్రీను తో లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ చిత్రంగా వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రీసెంట్ గా ఆడియో పంక్షన్ జరుపుకుంది. ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రోమోలు ఇండస్ట్రీలో అందరి దృష్టినీ ఆకర్షించాయి. దాంతో అతని తదుపరి చిత్రం డైరక్ట్ చేయటానికి పెద్ద దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అందులో సుకుమారు ఒకరు అని తెలుస్తోంది.

Sukumar Grabbed Bellamkonda Srinivas

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్‌ రూపొందిస్తున్న చిత్రం టైటిల్ 'అల్లుడు శ్రీను'. ఆ చిత్రంలో హీరో నిర్మాత కొడుకు శ్రీనివాస్. ఈ కుటుంబకథా చిత్రంలో సమంత హీరోయిన్‌ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలకు ధీటుగా హీరో శ్రీనివాస్‌ స్టెప్‌లు వేశాడని యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రం చాలా బాగా వస్తోందని, ట్రైలర్ విడుదల అయ్యాక..అంతా వినాయిక్ ప్రతిభ గురించే మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు.

బ్రహ్మానందం, శ్రీనివాస్ మధ్యలో వచ్చే అనేక సన్నివేశాల నేపథ్యంలో ఈ టైటిల్ అనేకసార్లు వినిపిస్తుండడంవల్ల ఈ చిత్రానికి ఇదే సరైన పేరని నిర్ణయించుకున్నామని తెలిపారు. సినిమా మొదటినుండి చాలా సరదా సరదాగా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా విందు భోజనం అందిస్తుందని, ఈ చిత్రంలో తమన్నా చేసిన పాట హైలెట్‌గా ఉండనుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని, ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులు ఆనందించేలా ఉంటుందని, కొత్త హీరో అయినా కానీ సినిమా అగ్ర స్థాయి హీరో చిత్రంలా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

ఈ నెల 29న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేయనున్నామని, ఏడు సంవత్సరాలుగా కథానాయకుడు శ్రీనివాస్ అన్ని రకాల శిక్షణలు తీసుకుని ఓ మంచి దర్శకుడు దగ్గర ఈ చిత్రాన్ని చేస్తుండడం సంతోషంగా ఉందని, ఓ రకంగా అతని అదృష్టంగా తాను భావిస్తున్నానని నిర్మాత బెల్లకొండ సురేష్ తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.


ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెనె్నల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

English summary
Sukumar who got a jolt after debacle of '1 Nenokkadine' is now getting ready to work with Alludu Seenu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu