చెర్రీ, సుక్కూ చిత్రం టైటిల్ ఇదే?, భలే వెరైటీగా ఉందే

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ''ధ్రువ'' షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలకానుంది.

ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇందులో కొత్తేముంది అంటారా...ఇప్పుడు ఈ చిత్రం టైటిల్ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ బయిలుదేరింది. దాన్ని మీముందు ఉంచటమే ఈ కథనం.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పిఎమ్' అని పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు హీరో, దర్శకుడు మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Sukumar Mark Title For Ram Charan movie

ఈ తరహా టైటిల్ అయితే జనాల్లోకి బాగా స్పీడుగా వెళ్తుందని సుకుమార్ భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మొదలయ్యే ప్రేమ కథ ఇది అని స్పష్టంగా తెలుస్తోంది.

ఈపరిస్థితుల్లో ఈ సినిమా కథాంశం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది ఓ ప్రక్కన ప్రచారం జరుగుతోంది.

కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశారని,. నవంబరు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సినీవర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X