బాహుబలి బాటలో పుష్ప.. రాజమౌళినీ ఫాలో అవ్వనున్న సుకుమార్

భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన "బాహుబలి" (Baahubali) సిరీస్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలను ఒకే సినిమాగా కలిపి "బాహుబలి: ది ఎపిక్" (Baahubali: The Epic) పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2025 అక్టోబర్ 31న విడుదల కానున్నది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బాక్సాఫీస్ పై బాహుబలి దండయాత్ర కొనసాగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి బాటలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నడవాలని ప్రయత్నిస్తున్నారంట. ఇంతకీ ఆ కథేంటీ? సుకుమార్ కొత్త స్ట్రాటజీతో ఏంటీ? వివరాల్లోకెళ్తే..

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్‌పీస్ బాహుబలి ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. 2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్, 2017లో విడుదలైన బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించాయి. రెండు భాగాల కలిపి రూ. 2500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

Sukumar Plans Pushpa Universe Re-Release After Baahubali The Epic Allu Arjun Set new record

ఇప్పుడు అదే విజువల్ వండర్‌ను మరోసారి పెద్ద తెరపై చూసే సమయం వచ్చింది. ఈ రెండు మాస్టర్ పీస్ ను ఒకే సినిమా గా మార్చి మూవీ మేకర్స్ "బాహుబలి: ది ఎపిక్" పేరుతో ఈ చిత్రం రీ-రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలను కలిపితే మొత్తం రన్‌టైమ్ 5 గంటలకు పైగా ఉండేలా ఉన్నా, దర్శకుడు రాజమౌళి ప్రత్యేక ఎడిటింగ్‌తో కథను కాంపాక్ట్ చేసి, 3 గంటల 43 నిమిషాల నిడివి గల కొత్త వెర్షన్‌ను సిద్ధం చేశారు. ఈ ఎడిటింగ్‌లో స్టోరీ లైన్ స్పీడ్ చేసి, మూవీ థీమ్ చెడిపోకుండా కొన్ని సీన్స్ లేపేసి.. రీమేక్ ను తీర్చిదిద్దారని సినీ వర్గాల సమాచారం.

ఇక "బాహుబలి: ది ఎపిక్" రీ-రిలీజ్‌పై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో హైప్ ఏర్పడింది. భారతదేశంతో పాటు యూఎస్‌ఏ, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్మురేపుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి: ది ఎపిక్ రీ-రిజన్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో "బాహుబలి: ది ఎపిక్" తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8.85 కోట్ల నుంచి రూ. 10 కోట్ల కలెక్షన్లు అందుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రీ-రిలీజ్ మళ్లీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

"బాహుబలి: ది ఎపిక్" రిలీజ్‌ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. "పుష్ప యూనివర్స్" కూడా బాహుబలి తరహాలోనే రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల టాక్. రాజమౌళి తరహాలో సుకుమార్ కూడా తన "పుష్ప యూనివర్స్" కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. 'పుష్ప: ది రైజ్', 'పుష్ప 2: ది రూల్' చిత్రాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ నయా రికార్డులు క్రియేట్ చేశాయి. ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ ను ఒకే సినిమాగా మిళితం చేసి రీమాస్టర్ వెర్షన్‌గా తీసుకురావాలన్న ఆలోచనలో సుకుమార్ ఉన్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

2021లో విడుదలైన "పుష్ప: ది రైజ్" మాస్ యాక్షన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌లో కూడా అద్భుత వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ₹350 కోట్లకు పైగా వసూలు చేసి ఆ సంవత్సరం టాప్ 3 ఇండియన్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. పుష్ప 1 బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడంతో దానికి సీక్వెల్ గా "పుష్ప 2: ది రూల్" 2025లో విడుదలైంది. ఈ మూవీ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం తొలి వారం రోజుల్లోనే ₹1000 కోట్ల మార్క్ దాటింది. ఈ సినిమా దాదాపు రూ. 1831 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.ఇలాంటి భారీ విజయం తర్వాత సుకుమార్‌ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని బాహుబలి తరహాలోనే ఒకే సినిమాగా రీమేక్ చేసి రీ రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు సినిమాలను కలిపితే దాదాపు 6 గంటలకు పైగా రన్‌టైమ్ ఉంటుంది. అందుకే రాజమౌళి మాదిరిగా సోర్టీ లైన్ మారకుండా చక్కగా ఎడిటింగ్ చేసి, సుమారు 3 గంటల 30 నిమిషాల నిడివి గల "పుష్ప - ది ఎపిక్ రూల్" పేరుతో విడుదల చేసే ఆలోచన ఉందట. ఈ వార్త నిజమైతే, "పుష్ప యూనివర్స్" రీ-రిజన్ వస్తే బాక్సాఫీస్‌పై మరల పుష్ప రాజ్ రాజ్యం నెలకొనే అవకాశం ఉంది. ఈ మూవీ కూడా మరోసారి ప్రపంచవ్యాప్తంగా నయా రికార్డులను క్రియేట్ చేస్తుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. పుష్ప యూనివర్స్ రీ-రిజన్ విడుదలైతే అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ ఇంకా పెరుగుతుందని, ఇండియన్ సినిమా చరిత్రలో మరో రికార్డును నెలకొల్పడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X