»   » చరణ్ కోసం సుకుమార్ స్పెషల్ స్కెచ్

చరణ్ కోసం సుకుమార్ స్పెషల్ స్కెచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మేధావి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ...తన గత రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ గా విదేశాలను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి చిత్రానికి సైతం యుఎస్ నేపధ్యంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన యుఎస్ లోనే ఆ లొకేషన్స్ లోనే తిరుగుతూ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రీసెంట్ చిత్రం నాన్నకు ప్రేమతో...మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సక్సెస్ ఫుల్ గా భాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ నేఫధ్యంలో అయనకు తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా ఓకే అయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ఒకే సారి విని ..స్టోరీ లైన్ ని ఓకే చేసారని, త్వరలోనే ట్రీట్ మెంట్ వెర్షన్ వారికి వినిపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

Sukumar, Ramcharan Target Now..

సినిమా కథ యుఎస్ లో జరుగుతుందని, అందుకుని అక్కడ రియల్ లొకేషన్స్ లో తిరిగుతూ స్క్రిప్టు రాసినట్లు ఉంటుంది. అలాగే బ్రేక్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుందని సుకుమార్ ఈ ట్రిప్ పెట్టాడంటున్నారు. ఈ ట్రిప్ లో ఆయన ఫ్యామిలితో కలిసి వెళ్లాడని సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తని ఒరవన్ చిత్రం చేస్తున్నారు. ధృవ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తనను బ్రూస్ లీ ప్లాఫ్ నుంచి బయిట పడేస్తుందని భావిస్తున్నాడు. సుకుమార్ తో చేయటం ద్వారా తనకు యుఎస్ లో మార్కెట్ పెరుగుతుందని రామ్ చరణ్ ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు.

English summary
Sukumar next has been confirmed with Ram Charan and the director is currently in the US .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu