»   » ప్రేమను డిస్కవరీ చేసే పనిలో యంగ్ హీరో బిజీ

ప్రేమను డిస్కవరీ చేసే పనిలో యంగ్ హీరో బిజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఎస్.ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్...హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. లవర్స్ సినిమా విజయం తర్వాత చక్కలిగింత చిత్రంతో మన ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో దిల్ రాజు నిర్మాతగా అడవి సాయికిరణ్ దర్శకత్వంలో కేరింత చిత్రం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మరో చిత్రం కమిటయ్యాడని సమాచారం. కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ఎకె.సహదేవ్ నిర్మాణం చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రానికి కొలంబస్ అనే టైటిల్ పెట్టారు. అలాగే డిస్కవరీ ఇన్ లవ్ అనే ట్యాగ్ ని ఉంచారు. ఎమ్.ఎస్ రాజు గారికి ఈ కథ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. సుమంత్ ఈ చిత్రంలో కొత్త లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. కథ,కథనం కొత్తగా ఉంటూ యూత్ ని టార్గెట్ చేస్తూ సాగుంతుందని తెలుస్తోంది.

కేరింత విషయానికి వస్తే..

‘తునీగ తూనీగ' సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుమంత్ అశ్విన్ ఇటీవలే విడుదలైన ‘అంతకుముందు ఆ తరువాత' సినిమాలోని నటనతో అందరినీ మెప్పించగలిగాడు. ‘వినాయకుడు' ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేయనున్న ఈ ‘కేరింత'టీజర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్య,బొమ్మరిల్లు,కొత్త బంగారులోకం లా చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్తున్నారు.

'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహించారు.

Sumant Ashwin's

సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు సాగుతున్నాయి. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.

''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్‌ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

English summary
Sumanth Ashwin next is titled as ‘Columbus’ and comes with the tag line ‘Discovery in Love’. A source says the film is a typical romantic entertainer and will be directed by a new comer.
Please Wait while comments are loading...