»   » సుమంత్ కొత్త సినిమా బడ్జెట్ట్ అంత ఎక్కువా?

సుమంత్ కొత్త సినిమా బడ్జెట్ట్ అంత ఎక్కువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్ హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం బడ్జెట్ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కోట్లు అని సమాచారం. ఇంతకు ముందు అష్ఠాచెమ్మ చిత్రం నిర్మాణానికి ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టిన నిర్మాత పి.రాంమోహన్ ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టడం అంతటా చర్చనీయాంశమైంది. ఇక ది మేన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ గా ఈ చిత్రం కథ నడుస్తుంది. హరి మోహన్ కథ అందిస్తున్నారు. మోహన్ కృష్ణ దర్శకత్వమే కాకుండా డైలాగులు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కలర్స్ స్వాతి చేస్తోంది. అలాగే సినిమాకి నలభై లక్షలు దాకా ఛార్జ్ చేసే సెంధిల్ కుమార్(మగధీర, అరుంధతి) కెమెరా వర్క్ చేయనున్నారు. ఏప్రియల్ నెల నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక సుమంత్ మీద ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అనేది అందరికీ సందేహంగా ఉంది. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న సుమంత్ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోవటం కష్టం గా ఉన్న పరిస్ధితుల్లో ఇంత పెట్టుబడి ఎంత వరకూ సమంజసం అనేది అందరి ప్రశ్న.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu