Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- News
వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ తెలుగు మూవీ ఓటీటీ రిలీజ్ కి అడ్డంకి.. మళ్ళీ అదే దారిలో తమిళ సంస్థ?
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ రంగం ఒకటి అని చెప్పక తప్పదు. కోట్లలో వ్యాపారం జరిగే సినీ పరిశ్రమ కరోనా కారణంగా మూగబోయింది. ఇక గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా, షూటింగ్‌లు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. అప్పుడు థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే తర్వాత పరిస్థితులు చక్కబడడంతో మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యాయి, మళ్ళీ సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ మరోసారి సినీ పరిశ్రమపై తన పంజాను విసురుతోంది. ప్రస్తుతం మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి.
దీంతో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇక అలా ఓటీటీ రిలీజ్ కి మరో సినిమా సిద్దం అయింది. టాలీవుడ్ లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన తేజ సజ్జ ఈ మధ్యనే జాంబీ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఆయన జాంబీ రెడ్డి సీక్వెల్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. అయితే నిజానికి తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇష్క్ సినిమా ఈ పాటికి రిలీజ్ కావాల్సి ఉంది.. కరోనా రెండో దశ నేపథ్యంలో థియేటర్లన్నీ మూసివేసిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

అయితే అది నిజం అయ్యే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా శాటిలైట్ అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సన్ నెట్వర్క్ సంస్థ కొనుక్కుంది. వాళ్లు నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన 'ఇష్క్' శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ కొనుక్కోగా వాళ్ళే 'ఇష్క్' డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోవటం లేదట. నిజానికి ఇంతకు ముందు కూడా సన్ సంస్థ రామ్ నటించిన 'రెడ్' మూవీ విడుదల విషయంలోనూ అభ్యంతరాలు తెలిపింది. ఇప్పుడు అదే పరిస్థితి 'ఇష్క్'కి రావటంతో ఫిల్మ్ మేకర్స్ అన్వేషణలో ఉన్నారని అంటున్నారు. అయితే ఈ అంశం మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.