సందీప్‌ కిషన్‌ 'డీకే బోస్‌' ఆ చిత్రం కాపీ అంటూ...

By Srikanya

హైదరాబాద్ : సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్‌'. నిషా అగర్వాల్‌ హీరోయిన్. ఎన్‌.బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్‌రంగా నిర్మాతలు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం "Groundhog day" ఆధారంగా రూపొందుతున్నట్లు టాలీవుడ్ లో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రోజు ఆగిపోవటంతో నెగిటివ్ గా ఉన్న హీరోలో మార్పు వస్తుంది. అలాంది కథే... 'డీకే బోస్‌' అంటున్నారు. నిజానిజాలు విడుదల అయితే కానీ తెలియవు.

నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు చిత్రించబోయే 'పడిపోయా' గీతం యువతకు బాగా నచ్చింది. ఈ నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. పాండిచ్చేరిలో చిత్ర గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'పడిపోయా పడిపోయా...' అంటూ సాగే ఈ గీతానికి శేఖర్‌ నృత్య రీతులు సమకూరుస్తారు. సంగీతం: అచ్చు, సహనిర్మాతలు: వెంకట రామరాజు, నజీర్‌.

డికె బోస్ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. అచ్చు సంగీతాన్ని అందించారు. విశ్వేశ్వర్ ఎస్వీ కెమెరాకు పని కల్పించారు. స్క్రిప్టు ఎన్ బోస్ రాసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X