»   » ప్రతినిధి పట్టిన సందీప్ కిషన్

ప్రతినిధి పట్టిన సందీప్ కిషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో సందీప్ కిషన్ తన కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు వైపు మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం తమిళ,మళయాళ హిట్ నేరం రీమేక్ లో చేస్తున్నాడు. తదుపరి చిత్రం సైతం మంచి పాయింట్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

గతంలో నారా రోహిత్ తో ప్రతినిధి చిత్రంకు కథ అందించిన ఆనంద్ రవి దర్శకత్వంలో సినిమా కమిటైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రతినిధి తరహాలోనే రెగ్యులర్ కమిర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా, కిక్ ఇచ్చే పాయింట్ తో సాగనుందని తెలుస్తోంది. ఆనంద్ రవి గతంలో శేఖర్ కమ్ముల వద్ద హ్యాపీ డేస్ వరకూ డైరక్షన్ డిపార్టమెంట్ లో పనిచేసారు.

Sundeep Kishan next with Anand ravi

సందీప్ కిషన్ ...హీరోగా చేసిన టైగర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు మళ్ళీ మరో సినిమా విడుగలకు కాలేకలేకపోయాడు. వెంకటాద్రి ఎక్స ప్రెస్ సినిమా తరువాత వచ్చిన ప్రతి సినిమా యావరేజ్ గానే పక్కకు వెళిపోయింది. అందుకోసం సినిమాల ఎంపికలో శ్రద్ద తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం జోరు పెంచిన ఈ హీరో ...ఒక అమ్మయి తప్ప మరియు నేరం రీమెక్ లతో బిజిగా వుండగానే, ఊలోపు మరోక సినిమాకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా ఆనంద్ రవి డైరక్షన్ లో వుండోచ్చని సమాచారం.

English summary
It is coming out that Sundeep Kishan is readying for his next under the direction of Anand Ravi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu