»   » సునీల్ ‘భక్త కన్నప్ప' లేటెస్ట్ ఇన్ఫో

సునీల్ ‘భక్త కన్నప్ప' లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలోఈ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. ఏప్రియల్ రెండవ వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం డిసెంబర్ 2015 లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ లోగా సునీల్ వి రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మకం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌కు టాలెంట్ ఉంది....కానీ ఆయన లాంటి కామెడీ హీరోతో తనికెళ్ల భరణి 'భక్త కన్నప్ప' లాంటి కథతో ప్రయోగం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి భరణి సునీల్ నుంచి మేరకు తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? ఇతర వివరాలు అఫీషియల్‌గా వెల్లడికావాల్సి ఉంది.

మరో ప్రక్క సునీల్ హీరోగా ఉదయ శంకర్ దర్శకుడిగా రూపొందిన చిత్రం 'భీమవరం బుల్లోడు'. సునీల్‌, ఎస్తేర్‌ జంటగా నటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 22న భీమవరంలో పాటల్ని విడుదల చేస్తున్నారు. ''ఈ సినిమాలో మొదటి సన్నివేశం నుంచి ఆఖరి సన్నివేశం వరకు నవ్విస్తూనే ఉంటాం. నేను అయిదు సినిమాల్లో హాస్యనటుడిగా చేస్తే ఎలా ఉంటుందో ఈ ఒక్క సినిమా అంత వినోదాన్నిస్తుంది'' అన్నారు సునీల్‌.

''మా సంస్థ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో వస్తున్న సినిమా ఇది. అన్ని వర్గాల్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సినిమాని సిద్ధం చేశారు'' అన్నారు నిర్మాత. పెళ్లి కాని కుర్రోడు.. ప్రేమ జ్వరం ఉన్నోడు.. బలమైన బలహీనుడు.. ధైర్యమున్న పిరికోడు.. తెలివైన వెర్రోడు.. గంభీరమైన తెలివైనోడు.. ఖాళీగా ఉండటంలో బిజీగా ఉన్నోడు.. తన కథ బాగా లేనోడు.. మా సినిమాలో నాయకుడు. ఇదీ మా భీమవరం బుల్లోడి నైజం అంటున్నారు ఉదయశంకర్‌.

English summary

 Tanikella Bharani zeroed Sunil as main lead in Baktha Kannappa film. This film will be launched in April and director Tanikella Bharani planned to complete the film by end of December 2014 and release on Jan 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu