»   » సునీల్ ‘భక్త కన్నప్ప' టైటిల్ మార్పు?

సునీల్ ‘భక్త కన్నప్ప' టైటిల్ మార్పు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sunil
హైదరాబాద్: 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలోఈ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం టైటిల్ మార్చనున్నారని సమాచారం. ఈ చిత్రానికి భక్త అనేది తీసేసి కేవలం ' కన్నప్ప'అని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు టైటిల్ ఇలా మారుస్తారనే సంగతి మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం డిసెంబర్ 2015 లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ లోగా సునీల్ వి రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మకం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌కు టాలెంట్ ఉంది....కానీ ఆయన లాంటి కామెడీ హీరోతో తనికెళ్ల భరణి 'భక్త కన్నప్ప' లాంటి కథతో ప్రయోగం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి భరణి సునీల్ నుంచి మేరకు తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? ఇతర వివరాలు అఫీషియల్‌గా వెల్లడికావాల్సి ఉంది.

English summary

 Comedian turned hero Sunil is all set to play the title role in Telugu period-drama ‘Kannappa' under the direction of Actor turned filmmaker Tanikella Bharani. The film was titled ‘Bhaktha Kannappa’ earlier but it has changed to Kannappa due to unknown reasons. As per the latest news the film makers are keen to launch the film in June. Currently pre-production works are going on in a full swing and it is taught to be an out-and-out period-drama set against the backdrop of 14th century.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu