»   » నారీ నారీ నడుమ సునీల్

నారీ నారీ నడుమ సునీల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:కామెడీ హీరోగా ముందుకు వెళ్తున్న సునీల్...ఇన్నాళ్లూ ఒక హీరోయిన్ తోనే సర్దుకున్నాడు. కానీ త్వరలో ఇద్దరు హీరోయిన్స్ తో సునీల్ రొమాన్స్ చేయనున్నాడు. వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సునీల్ సరసన ఇద్దరని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు...రిచా పనాయి, మాయా ఫేమ్ సుష్మా రాజ్.

క్రితం వారమే వీరిద్దరి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. సుష్మా ఈ వారం నుంచీ సెట్స్ కు వస్తే...నెలాఖరు నుంచి రిచా జాయిన్ కానుంది. కథలో వీరిద్దరికీ సమాన ప్రయారిటీ ఉందని, స్క్రిప్టు పూర్తి యాక్షన్ కామెడీతో రన్ కానున్నట్లు సమాచారం.

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం ఈడు గోల్డ్ ఎహే త్వరలోనే ప్రారంభం కానుంది.

Sunil romancing two heroines

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలియజేశారు.

ప్రస్తుతం సునీల్ హీరో గా వంశీకృష్ణ ఆకెళ్ల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా... సునీల్ సరసన రొమాన్స్ చేస్తోంది. ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సునీల్ హీరోగా రెడీ అయిన కృష్ణాష్టమి చిత్రం ..పిభ్రవరి 4న విడుదల కానుంది.

English summary
Sunil will be romancing two heroines in Eedu Gold Ehe. Sushma Raj of Maaya fame and Richa Panai are the heroines.
Please Wait while comments are loading...