twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భీమవరం బుల్లోడు’ ఆ సినిమా కాపీనా??

    By Srikanya
    |

    హైదరాబాద్ : సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థ యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విడుదలకు ముస్తాబు అవుతున్న ఈ చిత్రం Short Time (1990) అనే సినిమా ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది.

    పిరికివాడైన హీరో ఎలాగూ త్వరలో చనిపోతానని తెలుసుకుని లేని మొండి ధైర్యం తెచ్చుకుని సాహసాలు చేస్తాడు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదిరిస్తాడు. అయితే తర్వాత తాను చావబోవటం లేదని, తను తప్పుడు మెడికల్ రిపోర్టులు అందుకున్నానని తెలుసుకుంటాడు. అప్పుడు అతినిలో నిజమైన భయం మొదలవుతుంది. ఈ విషయం తను మొండి ధైర్యంతో ఎదిరించిన విలన్స్ కు సైతం తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది మిగతా కథ. ఇలాంటి కథే భీమవరం బుల్లోడులోనూ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కాన్సర్ పేషెంట్ ని అనుకున్న సునీల్...మొండితనంతో సాహసాలు చేయటం...తర్వాత తనకు కాన్సర్ లేదని తెలిసి ఇరిక్కిపోవటం ఫన్నీగా ఉంటుందంటున్నారు. అయితే ఇది కరెక్టా కాదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందే.

    Bheemavaram Bullodu

    సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
    దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.

    ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

    English summary
    Hero Sunil will next be seen in a hilarious entertainer Bheemavaram Bullodu. Now it was said that Sunil will be seen as a ‘cancer patient’ in the movie. And it's a copy of Short Time (1990)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X