»   » హాట్ న్యూస్: సన్నిలియోన్ తెలుగు ఎంట్రీ ఖరారు

హాట్ న్యూస్: సన్నిలియోన్ తెలుగు ఎంట్రీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ తెలుగులో నటించే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అవి వాటిని నిజం చేయటానికి ఓ సంస్ధ పూనుకుంది. ఆమె తెలుగు సినిమా ఎంట్రీ ఖరారయిందని తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు 'ఆషికి 2' రీమేక్. అందులో శ్రద్ద పాత్రకు ఆమెను ఫైనల్ చేసినట్లు సమాచారం. సచిన్ జోషి ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబినేషన్ లో జాక్ పాట్ అనే చిత్రం వచ్చింది. ఆ పరిచయంతో సన్నిలియోన్ ని సచిన్ జోషి రికమండేషన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

హిందీలో విజయవంతమైన 'ఆషికి 2' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రంలో ఆదిత్యా కపూర్,శ్రద్దా కపూర్ లీడ్ పెయిర్ గా చేసారు. తెలుగు వెర్షన్ కు గానూ సచిన్‌ జోషి(నిను చూడక నేనుండలేను,ఒరేయ్ పండు,మిత్రుడు) హీరో గా ఎంపిక చేసారు. ఈ చిత్రాన్ని జయ రవీంద్ర అనే దర్శకుడు డైరక్ట్ చేయనున్నారు. జయ రవింద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అతని మేకింగ్ స్టైల్ నచ్చి ఈ చిత్రం రీమేక్ అప్పచెప్పినట్లు సమాచారం.

Sunny Leone

ఇక వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి సెట్స్ కు వెళ్లనుంది. ప్రస్తుతం చిత్రం లో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ చిత్రం మిగతా కాస్టింగ్ ఎవరు, సాంకేతిక నిపుణులు ఎవరనేది త్వరలో నిర్మాతలు అఫీషియల్ ప్రకటన ద్వారా తెలియచేస్తారు.

చిత్రం కథేమిటంటే...- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్‌లో ఉండగా- అర్ధరాత్రి 'బార్'లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్‌కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్‌ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్‌ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

ఇటు సినిమాల్లోనూ అటు ప్రైవేట్ ఆల్బమ్‌లతోనూ బిజీగా మారిపోతుంది. అనుక్షణం ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ సలహాలు సూచనలూ చెబుతూ ఆమెలో ధైర్యాన్ని నింపే రాహుల్ రోజుల తరబడి తాగటంవల్ల అతడి గొంతు దెబ్బ తింటుంది. కనీసం లోబడ్జెట్ సినిమాలకైనా పాడదామనుకుంటే అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. రాన్రాను రాహుల్ పతనమవటం చూసిన ఆరోహి అతణ్ణి మళ్లీ మామూలు మనిషిగా.. గాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటుంది. దాంతో అతడి ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోతారిద్దరూ. కానీ - గతంలో చేసిన అగ్రిమెంట్స్ కారణంగా మళ్లీ కెరీర్‌ని ఆరంభించాల్సి వస్తుంది ఆరోహి. తన వల్లనే ఆమె కెరీర్ నాశనమై పోతోందనీ.. తను లేకుంటే ఆరోహి జీవితం బాగుంటుందని తలచి ఆత్మహత్య చేసుకొంటాడు రాహుల్. ఆ తర్వాత ఆరోహి జీవితం ఏమైందన్నది క్లైమాక్స్.

English summary
porn star turned actress Sunny Leone has been approached by Telugu director to play Shraddha’s character in 2013 musical hit ‘Aashiqui 2’ remake
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu